Home /News /andhra-pradesh /

KAPU RAMACHANDRA REDDY SON IN LAW MANJUNATH REDDY DIED IN MYSTERIOUS CIRCUMSTANCES IN VIJAYAWADA APARTMENT SK

Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు అనుమానాస్పద మృతి

వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మృతి

వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మృతి

Andhra Pradesh: మంజునాథరెడ్డి అప్పుడప్పుడూ ఈ ఫ్లాటుకు వచ్చి రెండు, మూడు రోజులు ఉంటారని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం విజయవాడకు వచ్చిన ఆయన.. శుక్రవారం రాత్రి మరణించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ విప్, వైసీపీ రాయదుర్గం  ఎమ్మెల్యే (Rayadurg MLA) కాపు రామచంద్రారెడ్డి (Kapu Ramachandra Reddy అల్లుడు మంజునాథరెడ్డి మరణించారు. శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో ఆయన మృతి చెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అవంతి అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్ నెంబర్ 101లో ఈ ఘటన చోటుచేసుకుంది. మంజునాథ్ రెడ్డి (Manjunath Reddy) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మంజునాథరెడ్డి అప్పుడప్పుడూ ఈ ఫ్లాటుకు వచ్చి రెండు, మూడు రోజులు ఉంటారని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం విజయవాడకు వచ్చిన ఆయన.. శుక్రవారం రాత్రి మరణించారు.

    మంజునాథరెడ్డి స్వగ్రామం అన్నమయ్య జిల్లాలోని రామాపురం మండలం పప్పిరెడ్డిగారిపల్లె. ఆయన తండ్రి పేరు మహేశ్వర్ రెడ్డి. మంజునాథ్ రెడ్డి తండ్రి వైసీపీలో ఉన్నారు. అంతేకాదు PMR కన్స్ట్రక్షన్స్ సంస్థను నడుపుతున్నారు. మంజునాథరెడ్డి భార్య స్రవంతి డాక్టర్‌గా పనిచేస్తున్నారు. కుమారుడి మృతిపై సమాచాారం అందిన వెంటనే ఆయన విజయవాడ (Vijayawada)కు బయలుదేరారు. కాశ్మీర్‌తో పాటు పలు రాష్ట్రాల్లో చేసిన పనులకు గాను రాంకీ సంస్థ నుంచి తమ కంపెనీకి బిల్లులు రావాల్సి ఉందని... బ్యాంకుల నుంచి సకాలంలో ఫైనాన్స్ అందలేదని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో తన కుమారుడు కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడికి గురయ్యారని పేర్కొన్నారు. మంజునాథ్ రెడ్డి మృతితో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఆయన మృతదేహం విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రిలో ఉంది.

    Big Twist: బాలయ్యను కలిసిన మంత్రి విడదల రజని.. అసలు ట్వీస్ట్ ఏంటంటే..?



    మంజునాథ్ రెడ్డి కుటుంబంలో కూడా కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. భార్యాభార్తల మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని మొదట అందరూ భావించినప్పటికీ... అక్కడి పరిస్థితులు అలా కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇది అనుమానాస్పద మృతిగానే కనిపిస్తోందని పేర్కొంటున్నారు. 101 ఫ్లాటు బాధ్యతలు చూసే నరేంద్రరెడ్డి అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో అపార్ట్‌మెంట్‌కు వచ్చి.. ఫ్లాట్లోకి వెళ్లారని అపార్ట్‌మెంట్ వాసులు తెలిపారు. మంజునాథ్ రెడ్డి పడిపోయారని చెప్పడంతో.. తామంతా వెళ్లి.. ఆయన్ను అంబులెన్స్‌లోకి ఎక్కించామని చెప్పారు. ఐతే ఆయన ఎప్పుడు చనిపోయారు? ఎలా మరణించారన్న దానిపై స్పష్టత లేదని వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Vijayawada, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు