Kapu Reservations: ప్రధాని మోదీకి కాపు నేత ముద్రగడ లేఖ..

Kapu Reservations: ప్రధాని మోదీకి కాపు నేత ముద్రగడ లేఖ..

ముద్రగడ పద్మనాభం

Kapu Reservations | కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2017లో ఏపీ సర్కారు ఆమోదించిన రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో ముద్రగడ పద్మనాభం కోరారు.

  • Share this:
    ప్రధాని నరేంద్ర మోదీకి కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపు రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ప్రధాని మోదీని కోరారు. దేశ స్వాతంత్ర్యానికి ముందు..ఆ తర్వాత కాపులు ఏపీలో బీసీ రిజర్వేషన్లు అనుభవించారని గుర్తు చేశారు. 1915 నుంచి 1956 వరకు కాపులకు ఈ రిజర్వేషన్లు అమలులో ఉన్నట్లు చెప్పారు. 1956లో ఏపీ సీఎం నీలం సంజీవరెడ్డి కాపులకు రిజర్వేషన్లు రద్దు చేసినట్లు గుర్తుచేశారు. 1961లో దళిత సీఎం దామోదరం సంజీవయ్య తిరిగి కాపులకు రిజర్వేషన్లు తీసుకొచ్చారని వివరించారు. అయితే 1964లో నాటి సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి కాపులకు రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తివేసి...కాపు సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు.

    గత 50 ఏళ్లుగా రాజకీయ పార్టీలకు కాపులకు తిరిగి రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని...ఆ తర్వాత తమ హామీలను నెరవేర్చకుండా కాపులను మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. బీసీ(ఎఫ్) కేటగిరీలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2017లో నాటి చంద్రబాబు సర్కారు ఏపీ అసెంబ్లీలో బిల్లును ఆమోదించిందన్నారు. దీన్ని కేంద్ర హోం శాఖకు పంపగా...ఇప్పటి వరకు అది పెండింగ్‌లో ఉందన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపి కటిక పేదరికంలో మగ్గుతున్న కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ముద్రగడ పద్మనాభవం ప్రధాని మోదీకి రాసిన లేఖలో కోరారు.
    Published by:Janardhan V
    First published: