కనుమ పండుగ విశిష్టత...నేడే ముక్కల పండగ...కోడికూర చిల్లిగారెతో మజా మజా...

కనుమ రోజున మాంసాహారం తినడం ఆనవాయితీ. మాంసాహారులు కానివారు మినుప గారెలు తింటారు. కనుమను ‘ముక్కల పండుగ’ అని అంటారు. సంక్రాంతిపండుగలో మూడవరోజు కనుమ నాడు మాంసాహారం ముందువరుసలో ఉంటుంది.

news18-telugu
Updated: January 16, 2020, 6:13 AM IST
కనుమ పండుగ విశిష్టత...నేడే ముక్కల పండగ...కోడికూర చిల్లిగారెతో మజా మజా...
కనుమ పండుగ (Image: ఫైల్ చిత్రం)
  • Share this:
సంక్రాంతి వేడుకల్లో మూడో రోజైన కనుమ రైతులకు ఎంతో ప్రత్యేకమైనది. తమ పశుసంపద కోసం రైతులు కనుమ పండుగ జరుపుకుంటారు. కనుమ రోజు… రైతులు ఆవులు, ఎద్దులతో తమకున్న అనుబంధాన్ని చాటుకుంటారు. వాటితో ఈ రోజు ఎలాంటి పనీ చేయించరు. ఉదయమే పశువులను శుభ్రంగా కడుగుతారు. పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టి… వాటి మెడలో గల్లుగల్లుమనే మువ్వల పట్టీలు కడతారు. కొమ్ములకు కూడా ప్రత్యేకంగా రంగులు వేసి అలంకరిస్తారు. తర్వాత వాటికి హారతి ఇచ్చి పూజ చేస్తారు. పశువులకు కొత్త ధాన్యంతో వండిన పొంగలి తినిపిస్తారు.

కనుమ రోజున మాంసాహారం తినడం ఆనవాయితీ. మాంసాహారులు కానివారు మినుప గారెలు తింటారు. కనుమను ‘ముక్కల పండుగ’ అని అంటారు. సంక్రాంతిపండుగలో మూడవరోజు కనుమ నాడు మాంసాహారం ముందువరుసలో ఉంటుంది. తెలుగు ప్రజలు కనుమ పండుగను జోరుగా జరుపుకుంటారు. కనుమ రోజు మినుము తినాలి అని చెప్పిన పెద్దలు.. అందులోకి నాటుకోడి మాంసం ఉండాలంటారు. కేవలం కోడికూరతో ఆగిపోకుండా.. ముగ్గురు నలుగురు కలిసి మేకను కోసుకొని తినడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అలాగే కనుమనాడు చికెన్‌‌, మటన్‌‌ షాపుల ముందు జనాలు బారులు తీరుతారు.

First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>