త్వరలో టీడీపీ ఖాళీ... వైసీపీ నుంచీ ఆ ఎమ్మెల్యేలు... కన్నా సంచలన వ్యాఖ్యలు...

Andhra Pradesh : తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆల్రెడీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించేసింది. దానికి కొనసాగింపుగా... కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం తెప్పించబోతున్నాయా?

Krishna Kumar N | news18-telugu
Updated: July 14, 2019, 7:24 AM IST
త్వరలో టీడీపీ ఖాళీ... వైసీపీ నుంచీ ఆ ఎమ్మెల్యేలు... కన్నా సంచలన వ్యాఖ్యలు...
కన్నా లక్ష్మీనారాయణ
Krishna Kumar N | news18-telugu
Updated: July 14, 2019, 7:24 AM IST
రాజకీయ నేతలకు ఓ అలవాటు ఉంటుంది. ఏదైనా సెన్సేషనల్ న్యూస్‌ని తమ మనసులో ఎక్కువ కాలం దాచుకోవడానికి ఇష్టపడరు. దాన్ని బయటపెట్టి... అందరూ దాని గురించి మాట్లాడుకోవాలని కోరుకుంటారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఆ కోవలోకే వస్తున్నట్లు కనిపిస్తోంది. అధిష్టానం ఆలోచనలను ఆయన తన మాటల ద్వారా బయటపెట్టినట్లు కనిపిస్తోంది. గుంటూరులో ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ త్వరలోనే ఖాళీ అయిపోతుందని అన్నారు. టీడీపీలోని 7 లేదా 8 మంది ఎమ్మెల్యేలను తప్ప... మిగతా అందర్నీ బీజేపీలో చేర్చుకుంటామన్నారు. ఏపీలో టీడీపీకి ఉన్నది 23 సీట్లు. వాటిలో 8 తీసేస్తే... కన్నా చెప్పినట్లు బీజేపీలో చేరబోయేది 15 మంది అనుకోవచ్చు. ఇంతమందిని ఒకేసారి పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా... టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచీ తప్పించవచ్చని కన్నా భావించి ఉండొచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టీడీపీ ఖాళీ అయితే... ఇక ప్రధాన ప్రతిపక్షంగా తామే ఉంటామనీ, తద్వారా వైసీపీని టార్గెట్ చేస్తూ... ఎన్నికలకు సన్నద్ధం అవ్వొచ్చని కన్నా ఆలోచిస్తూ ఉండొచ్చని భావిస్తున్నారు.

వైసీపీపైనా సెన్సేషనల్ కామెంట్స్ : ఏపీలో బీజేపీ... టీడీపీని టార్గెట్ చేస్తుందని మనందరికీ తెలుసు. కొత్తగా ప్రభుత్వం చేపట్టిన వైసీపీ జోలికి వెళ్లదని చాలా మంది అనుకుంటున్నారు. ఆల్రెడీ వైసీపీ... బీజేపీతో సఖ్యతగా ఉంది కాబట్టి... ఆ పార్టీ పట్ల సానుకూలంగా ఉంటారని వారంతా భావించారు. కానీ... కన్నా మాటలు మరోలా ఉన్నాయి. వైసీపీ నేతలు కూడా తమతో టచ్‌లో ఉన్నారని ఆయన అంటున్నారు. అంటే ఛాన్స్ ఉంటే... వైసీపీ ఎమ్మెల్యేలను కూడా బీజేపీలో కలిపేసుకోవాలని కన్నా ఆలోచిస్తున్నారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఐతే... వైసీపీ నుంచి మాత్రం అలాంటి పరిస్థితి ఉండదంటున్నారు ఆ పార్టీ నేతలు.

టీడీపీ అధినేత చంద్రబాబు... మళ్లీ బీజేపీవైపు చూస్తున్నారనీ... ఆ పార్టీతో దోస్తీ కోసం ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరుపుతున్నారనే వదంతుల్ని కన్నా కొట్టిపారేశారు. చంద్రబాబు అవసరం తమకు లేదన్న ఆయన... ఆ మాటకొస్తే... టీడీపీకి కూడా చంద్రబాబు అవసరం లేదని అనడం కాస్త ఓవరైందని అనుకోవచ్చు. ఏది ఏమైనా... త్వరలోనే ఆపరేషన్ ఆకర్ష్ ఫలితాల్ని మనం చూస్తామనే సంకేతాలు కన్నా లక్ష్మీనారాయణ నుంచీ వస్తున్నాయి.

First published: July 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...