Kanipakam Brahmotsav 2020: స్వయంభువు అయిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ధ్వజస్తంభంపై ఉన్న మూషిక పటానికి ప్రత్యేక పూజలు చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. తర్వాత మూషిక పటాన్ని ధ్వజస్తంభం పైకి ఎగురవేసి బ్రహ్మాది దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. తర్వాత ధ్వజస్తంభంపై ఉన్న వినాయక స్వామివారి పటానికి పాలు, పెరుగు, తేనె, పంచదార పోసి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా ఈ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగలా జరిగేవి. ఈసారి మాత్రం కరోనా రూల్స్ ఉన్నాయి. అందువల్ల ఉత్సవాలు ఆలయం వరకే పరిమితమయ్యాయి.
ఆదివారం సాయంత్రం హంస వాహన సేవ జరగనుంది. దాన్ని చూసేందుకు కూడా కొద్ది మంది భక్తులకే అనుమతి ఇవ్వనున్నారు. ప్రస్తుతం విద్యుత్ వెలుగులు, ప్రత్యేక పుష్పాల డెకరేషన్తో విఘ్నేశ్వర ఆలయం రంగురంగులుగా వెలుగుతోంది. శనివారం వినాయక చవితి కాబట్టి ప్రపంచ ప్రఖ్యాత ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేకువజామునే గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. రూల్స్ అమల్లో ఉన్నప్పటికి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలోనే వచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ganesh Chaturthi 2020