కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు నెమలి వాహనంపై ఆలయ ప్రకారమండపంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు విఘ్నేశ్వరుడు. ఈ వాహన సేవకు కాణిపాకం, ఆగరంపల్లె, చినకాంపల్లె,కొత్త పల్లె కు చెందిన గ్రామస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ముందుగా మూల విరాట్ కు అభిషేకాదులు నిర్వహించి అనంతరం అలంకార మండపంలో ఉన్న సిద్ధి బుద్ధి సమేత శ్రీ స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అనంతరం నెమలి వాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి ధూప,దీప, నైవేద్యాలు సమర్పించారు. ఆ తర్వాత ఆలయ అధికారులు, ఉభయదారులు సంయుక్తంగా స్వామివారిని వారి భుజస్కంధాలపై మోస్తూ మేళతాళాలు మంగళ వైయిద్యాల నడుమ ప్రాకారోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేష్, AEO విద్యాసాగర్ రెడ్డి,SUP కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిషోర్ రెడ్డి మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఏటా ఈ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగలా జరిగేవి. ఈసారి మాత్రం కరోనా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాలు ఆలయం వరకే పరిమితమయ్యాయి. భక్తులను పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.