హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kakinada: పద్మశ్రీ పొందిన చంద్రశేఖర్ కామెంట్స్.. ఈ అవార్డ్ వారందరికీ అంకితం

Kakinada: పద్మశ్రీ పొందిన చంద్రశేఖర్ కామెంట్స్.. ఈ అవార్డ్ వారందరికీ అంకితం

చంద్రశేఖర్

చంద్రశేఖర్

Kakinada: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగువారికి ప్రాధాన్యత లభించింది.  ఏపీ నుంచి ఏడుగురికి, తెలంగాణ నుంచి ఐదుగురికి పద్మ పురస్కారాలు దక్కాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Kakinada, India

74వ గణతంత్ర దినోత్సవం  (Republic day) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను (Padma Awards) ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన వారిని ఈ అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది. ఇందులో ఏపీ నుంచి ఏడుగురు ఉన్నారు.  కాకినాడకు చెరందిన సంకురాత్రి చంద్రశేఖర్‌ (79) పద్మశ్రీ (Padma Shri) పురస్కారానికి ఎంపికయ్యారు. ఈయన సామాజిక కార్యకర్త. వైద్య, విద్యారంగంలో పేదలకు ఉచితంగా సేవలు అందిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. చంద్రశేఖర్‌ (Chandra Sekhar)కు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.

సెల్ఫీ సరదా ఎంత డేంజరో తెలుసా..? శివుడిగా పోజ్ ఇవ్వాలని శవమయ్యాడు

'' నేను చేసిన పనికి గుర్తింపుగా అవార్డు వచ్చినట్లు భావిస్తున్నా. చాలా సంతోషంగా ఉంది, ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. ఈ అవార్డు రావడం వెనుక ఎంతో మంది శ్రమ ఉంది. సమాజంలో వెనుకబడిన వారిని పైకి తీసుకురావాలనేది మా ఉద్దేశం. 1992 లో మొదట స్కూల్ స్థాపించాం.  పేదపిల్లలకు మంచి చదువు అందిస్తున్నాం. అందరికీ నాణ్యమైన చూపు అందించాలని కంటి ఆసుపత్రి స్థాపించడం జరిగింది. 30 ఏళ్లలో మూడు లక్షల 25 వేల కంటి ఆపరేషన్ లు చేయించా. అందులో 90 శాతం మంది దగ్గర డబ్బులు తీసుకోలేదు. ప్రజలకు సేవ చేయడం దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నా.  అవార్డు వచ్చినందుకు గర్వపడను. మరింత బాధ్యతతో పనిచేస్తాను. నాతో పాటు కష్టపడిన వారందరికి ఈ అవార్డ్ అంకితం ఇస్తున్నా.''  అని చంద్రశేఖర్ అన్నారు.

 తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు.. ఒకే రోజు ఏడు వాహన సేవలు.. ప్రత్యేకత ఇదే

కాగా, చంద్రశేఖర్ రాజమండ్రిలో ప్రాథమిక విద్య చదువుకున్నారు. ఆంధ్రా యూనివర్శిటీలో ఎంఎస్సీ పూర్తి చేశారు. ఆ తర్వాత కెనడాలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. జీవశాస్త్రంలో పీహెచ్‌డీ చేసి ఆయన... ఆరోగ్యశాఖలో ఉద్యోగిగా చేరారు. ఐతే 1985 జూన్ 23న ఉగ్రవాదులు ఎయిర్ ఇండియా కనిష్క విమానాన్ని బాంబులతో కూల్చారు. ఈ ఘటనలో భార్య మంజరి, కుమార్తె శారద, కుమారుడు శ్రీకిరణ్‌లను పోగొట్టుకున్నారు. భార్యాపిల్లల మరణానంతరం.. 1988లో కాకినాడ వచ్చి సమాజసేవకు పూనుకున్నారు చంద్రశేఖర్.

ఇక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగువారికి ప్రాధాన్యత లభించింది.  ఏపీ నుంచి ఏడుగురికి, తెలంగాణ నుంచి ఐదుగురికి పద్మ పురస్కారాలు దక్కాయి.  ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామికి(China Jeeyar Swamy) పద్మభూషణ్ పురస్కారం లభించింది. తెలంగాణకు చెందిన కమలేశ్ పటేల్‌కు కూడా పద్మభూషణ్(Padma Bhushan) పురస్కారం దక్కింది.  వీరితో పాటు తెలంగాణ, ఏపీ నుంచి మరికొందరికి పద్మ పురస్కారాలు లభించాయి. తెలంగాణ నుంచి మడడుగు విజయ్ గుప్తా, పసుపులేటి హనుమంతరావు, బి. రామకృష్ణారెడ్డికి పద్మశ్రీ అవార్డులు రాగా.. ఏపీ నుంచి గణేశ్ నాగప్ప కృష్ణరాజన్నగార, సీవీ రాజు, అబ్బరెడ్డి నాగేశ్వరరావు, కోట సచ్చిదానంద శాస్త్రి, సంకురాత్రి చంద్రశేఖర్, ప్రకాశ్ చంద్ర సూద్‌, ఎంఎం కీరవాణి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి.

First published:

Tags: Andhra Pradesh, AP News, Local News