Kakinada traffic DSP Advise to parents : పిల్లల పై మక్కువతో వారు కోరిన హై స్పీడ్ బైక్లు తమ స్తోమతకు మించి కొనిస్తే వారు రేష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ వంటి రోడ్డు నిబంధనలు ఉల్లంఘించడం కాకుండా ప్రాణాలు మీదకు తెచ్చుకుంటూ ఇతరులను ప్రమాదాలకు గురిచేస్తున్న సందర్భంలో అనేక ఇబ్బందులు పడుతున్నారనీ కాకినాడ ట్రాఫిక్ డి ఎస్పీ మొగలి వేంకటేశ్వర రావు తెలిపారు. గురువారం టూటౌన్ ట్రాఫిక్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను జిల్లా ఎస్పీ ఎం రవీంద్రబాబు సూచనల మేరకు కాకినాడ సిటీ నీ అరు సేక్టార్లుగా విభజించి ఆరు ట్రాఫిక్ ఎస్సైలు విధులు నిర్వర్తించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది అన్నారు.
అయితే ఆగతాయిలు రేష్ డ్రైవింగ్ పై నిఘా పెట్టిన పోలీసుల కదలికల పై కొందరు యువత 8 వాట్స్ ప్ గ్రూపులు ఏర్పాటు చేసి 802 మంది సభ్యలు కలిగి కాకినాడ ట్రాఫిక్ పోలీసు అప్డేట్ పేరుతో ఎప్పటి కప్పుడు పోలీసు చేకింగ్, బీట్లు తదితర సమాచారాన్ని అందిస్తు పోలీసుల కళ్లుగప్పి రేష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారు తప్పించుకోవడం జరుగు తుండని ఇటువంటి వారిని పసిగట్టి విచారణ చేపట్టడం తో అసలు విషయం వెలుగు జూసిందని తెలిపారు. ఈ గ్రూపులో ఉన్న వారిలో నలుగురు అడ్మిన్ లు కార్యకలాపాల సాగిస్తున్న వారిని గుర్తించి తల్లీ దండ్రులకు సమాచారం అందజేసి మొదటి తప్పు గా కౌన్స్లింగ్ ఇచ్చి పంపించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సి ఐ చైతన్య కృష్ణ, ఎస్సైలు పాల్గొన్నారు.
Visakha Express : రైలు ప్రయాణికులకు విజ్ఞప్తి.. విశాఖ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు
ఆగతాయిలు రేష్ డ్రైవింగ్ పై నిఘా పెట్టిన పోలీసుల కదలికల పై కొందరు యువత 8 వాట్స్ ప్ గ్రూపులు ఏర్పాటు చేసి 802 మంది సభ్యలు కలిగి కాకినాడ ట్రాఫిక్ పోలీసు అప్డేట్ పేరుతో ఎప్పటి కప్పుడు పోలీసు చేకింగ్, బీట్లు తదితర సమాచారాన్ని అందిస్తు పోలీసుల కళ్లుగప్పి రేష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారు తప్పించుకోవడం జరుగు తుండని ఇటువంటి వారిని పసిగట్టి విచారణ చేపట్టడం తో అసలు విషయం వెలుగు జూసిందని తెలిపారు. ఈ గ్రూపులో ఉన్న వారిలో నలుగురు అడ్మిన్ లు కార్యకలాపాల సాగిస్తున్న వారిని గుర్తించి తల్లీ దండ్రులకు సమాచారం అందజేసి మొదటి తప్పు గా కౌన్స్లింగ్ ఇచ్చి పంపించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సి ఐ చైతన్య కృష్ణ, ఎస్సైలు పాల్గొన్నారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bike rides, Kakinada, Traffic rules