• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • KADIYAM NURSARY IN ANDHRA PRADESH GIVES A BEAUTIFUL BIRTH DAY GIFT TO TELANGANA CM K CHANDRASEKHAR RAO BA

KCR Birthday: కేసీఆర్‌ పుట్టినరోజుకు ఆంధ్ర వాసులు ఇచ్చిన ఈ గిఫ్ట్ సూపర్..

KCR Birthday: కేసీఆర్‌ పుట్టినరోజుకు ఆంధ్ర వాసులు ఇచ్చిన ఈ గిఫ్ట్ సూపర్..

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

తూర్పు గోదావరి జిల్లా వాసులు పల్ల సత్తిబాబు, పల్ల సుబ్రహ్మణ్యం, పల్ల గణపతి రంగురంగుల పూలు, పూలమొక్కలతో కేసీఆర్ చిత్రపటాన్ని సృజనాత్మకంగా తీర్చిదిద్ది జన్మదిన శుభాకంక్షలు తెలిపారు.

  • Share this:
    తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టిన రోజును (ఫిబ్రవరి 17) పురస్కరించుకొని తూర్పు గోదావరి జిల్లా కడియం పల్ల వెంకన్న నర్సరీ నిర్వాహకులు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా వాసులు పల్ల సత్తిబాబు, పల్ల సుబ్రహ్మణ్యం, పల్ల గణపతి రంగురంగుల పూలు, పూలమొక్కలతో కేసీఆర్ చిత్రపటాన్ని సృజనాత్మకంగా తీర్చిదిద్ది జన్మదిన శుభాకంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమంతో ప్రేరణ పొంది తాము ఈ విధంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపామని వారు తెలిపారు. తెలంగాణేతర ప్రజలు ఈ విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం పలువురిని ఆకర్షించింది.

    తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బర్త్‌డే ఫిబ్రవరి 17న. ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పుట్టిన రోజున ఉదయం 10-00 గంటల నుంచి 11-00 గంటల వరకు కేవలం ఒక గంట వ్యవధిలో కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.  ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రీన్ చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటుతున్నారు.

    కేసీఆర్‌ బర్త్ డేకు కడియం నర్సరీ అందించిన గిఫ్ట్


    మరోవైపు కేసీఆర్ బర్త్ డే రోజున బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి బంగారు చీరను సమర్పించనున్నట్లు తెలంగాణ పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇప్పటికే తెలిపారు. ఫిబ్రవరి 17న ఉదయం ఆరు గంటలకు ఎల్లమ్మ అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం, తొమ్మిది గంటలకు మృత్యుంజయ హోమం, ఆయుష్షు హోమం, అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. దాతల సహకారంతో 2.5 కేజీల బంగారంతో రూపొందించిన చీరను అమ్మవారికి సమర్పిస్తామని ఆయన వెల్లడించారు.

    రేపు 17వ తేదీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మంగళవారం ఖమ్మం నగరంలోని లకారం వాకర్స్ ప్యారడైజ్‌లో ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్, నటులు శివాజిరాజా, TANA అధ్యక్షుడు జై తాళ్లూరితో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రగతికి రాష్ట్రం ఏర్పాటైన తొలి నాళ్లలోనే తెలంగాణకు హరితహారం కార్యక్రమం మొదలుపెట్టారని తెలిపారు. ఆరేళ్ల హరితహరం, మూడేళ్ల గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫలితాలు ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తున్నాయని అన్నారు. ఈ సందర్బంగా సీఎం పుట్టిన రోజు నాడు హరిత కానుక ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కోటి వృక్షార్చనలో పాల్గొని విజయవంతం చేస్తామన్నారు. బుధవారం జరిగే కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ స్వచ్చందం పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు