Home /News /andhra-pradesh /

KADIRI JASMINES HAS UNIQUE FRAGRANCE AND SPECIALTY AS FARMERS GAINING PROFITS FULL DETAILS HERE PRN

Kadiri: కదిరి మల్లెకు అంతటి సువాసన ఎలా..? ఖాద్రీశుడికి ఈ మల్లెలతోనే అలంకరణ ఎందుకు..?

కదిరి మల్లెపూలు (ఫైల్)

కదిరి మల్లెపూలు (ఫైల్)

Kadiri: ఖాద్రీసుడి బ్రహ్మోత్సవాల సమయానికి విరబూసే ఈ మల్లెలు మరింత సువాసనలు వెదజల్లుతాయంట. కదిరి ప్రాంతంలో అడుగుపెడుతుండగానే మల్లెల గుబాళింపు మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా మల్లెతోటలు వేస్తుంటారు.

  పండగలొచ్చినా, ఫంక్షన్‌లైనా పూలు లేకపోతే పనిజరిగదు. గులాబి, మల్లె, చామంతి, బంతి, కనకాంబరం, సన్నజాజి.. ఇలా ఎన్నో రకాల పూలు ఉన్నా.. కదిరి మల్లెల స్థానం మాత్రం వాటిదే. లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో సైతం స్వామివారికి కదిరి మల్లెలతోనే అలంకారం చేస్తారు. పొరుగు రాష్ట్రాల్లోనూ చెప్పాలంటే దేశవ్యాప్తంగా కదిరి మల్లెలకు మంచి పేరుంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని సత్యసాయి జిల్లా (Satyasai District) కదిరి ప్రాంతానికి చెందిన మల్లెల సువాసన మనల్ని మైమరపిస్తాయి. ఇంకా చెప్పాలంటే ఖాద్రీసుడి బ్రహ్మోత్సవాల సమయానికి విరబూసే ఈ మల్లెలు మరింత సువాసనలు వెదజల్లుతాయంట. కదిరి ప్రాంతంలో అడుగుపెడుతుండగానే మల్లెల గుబాళింపు మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా మల్లెతోటలు వేస్తుంటారు. దాదాపు 500ఎకరాలకు పైగా ఇక్కడ మల్లెల సాగు చేస్తుంటారు. దీని వల్ల ఆ ప్రాంతంలో ఎంతో మందికి పనులు దొరుకుతున్నాయి.

  ఇక్కడ సాగు చేసే మల్లెలు..కదిరిలో మాత్రమే కాదు పొరుగు రాష్ట్రాలకు, వివిధ పట్టణాలకు ఎగుమతి చేస్తుంటారు. రైతుల నుంచి పొలం దగ్గరే వ్యాపారులు కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత వాటిని వ్యాపారస్థులే సరఫరా చేస్తుంటారు. అలా సరఫరా అయిన మల్లెలలను ఆయా పట్టణాల్లోని మార్కెట్‌లో స్పెషల్‌గా కదిరి మల్లెలు.. కదిరి మల్లెలు అని అరుస్తూ అమ్ముతారు.

  ఇది చదవండి: బిడ్డ పుట్టాలంటే కీడుపాకకు వెళ్లాల్సిందే..! ఆ మూడు రోజులూ అక్కడే..! ఏపీలో వింత ఆచారం..


  ఖాద్రీశుడికి మల్లెపూలంటే ఎంతో ప్రీతి:
  శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి అలంకార ప్రియుడు. అంతేకాదు తెల్లని మల్లెపూలు అంటే మరెంతో ఇష్టం. అందులోనూ మంచి సువాసనలు గుప్పించే కదిరి మల్లెలంటే మరింత ప్రీతికరం. దీంతో ప్రతి రోజూ ఖాద్రీశుడిని కదిరి మల్లెలతోనే అలంకరిస్తారు. ప్రతి ఏడాది వైశాఖ పౌర్ణమి నాడు స్వామివారికి ప్రత్యేకంగా కదిరి మల్లెపూల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. మల్లెపూలను సాగుచేసే రైతులే ఈ ఉత్సవానికి ఉభయదారులుగా వ్యవహరిస్తారు. ఆ రోజు భూదేవి, శ్రీదేవి సమేతంగా శ్రీవారు… మద్దిలేటి ఒడ్డున ఉన్న ఉత్సవ మంటపం వద్ద కొలువుదీరుతారు. ఆ సమయంలో ప్రత్యేకంగా స్వామివారిని మల్లెపూలతోనే అలంకరిస్తారు.

  ఇది చదవండి: నిజంగా తెల్లబంగారమే.. ! గింజ నుంచి పిప్పి వరకు అన్ని ఉపయోగాలే..!


  మల్లెలు సమర్పిస్తే కోరిన కోర్కెలు తీరుతాయి..!
  లక్ష్మీ సతుడు..శ్రీమహా విష్ణువుకు మల్లెలంటే మహా ఇష్టం. అందుకే శ్రీవారికి మల్లెపూలు సమర్పించి ఏమైనా కోరుకుంటే.. తప్పక తీరుస్తాడని భక్తుల విశ్వాసం. బ్రహ్మోత్సవాల్లో మోహినీ ఉత్సవం నాడు స్వామివారి కుచ్చుల వాలుజడ కదిర మల్లెలతోనే సిద్దం చేస్తాం. ఏటా మల్లెపూల ఉత్సవాన్ని మరింత శోభాయమానంగా నిర్వహిస్తాం.

  ఇది చదవండి: చింతగింజలకు కాసులు రాలుతున్నాయ్..! ఏడాదికి కోట్లలో బిజినెస్.. 


  కదిరి మల్లెలకు అంతటి సువాసన ఎలా ?
  పూలంటే ఇష్టపడని వాళ్లు సైతం కదిరి మల్లెలు వెదజల్లే సువాసనకు ముగ్దులవ్వాల్సిందే. అయితే ఈ మల్లెలకు ఎందుకంత సువాసన వస్తుందంటే…ఈ ప్రాంత నేల స్వభావం కారణంగానే మల్లెలు మంచి సువాసననిస్తుంటాయని రైతులు చెప్పుకొస్తున్నారు.

  ఇది చదవండి: ఇప్పుడీ రెస్టారెంట్ అందరికీ ఫేవరెట్ స్పాట్.. ఇక్కడ స్పెషాలిటీ ఇదే..!


  మల్లె తోటల సాగుతో ఉపాధి:
  ఎకరం పొలంలో మల్లె తోట సాగు చేస్తే ఏడాదికి రూ.5 లక్షలు సంపాదించవచ్చు...ఒక్కోసారి మల్లెపూలు కిలో రూ.500 పలుకుతుంది. కిలో మల్లెపూలు కోస్తే రూ.75 వరకు కూలి ఇస్తారు. ఆ లెక్కను కూలీలు దాదాపు రోజూ రూ.300 వరకు సంపాదిస్తాను.  కదిరి మల్లెల కుంకుమ ప్రత్యేకం
  కదిరి కుంకుమకు ప్రత్యేక స్థానం ఉంది. స్వామి వారి దర్శనానికి వచ్చిన మహిళలు కచ్చితంగా అక్కడి కుంకుమను కొనుక్కోని వెళ్తారు. ఈ కుంకుమను శుభకార్యాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కదిరి దవనంతో ఫర్‌ఫ్యూమ్‌లు, అత్తరు తయారుచేస్తారు. ముంబై, గోవా, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు ఈ కదిరి దవనం ఎగుమతి చేస్తుంటారు. కర్ణాటక నుంచి వచ్చే భక్తులు ఐతే కదిరి దవనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు తమ వెంట కదిరి మల్లెలు, దవనం, కుంకుమ తప్పకుండా తీసుకెళ్తారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, Jasmine

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు