ప్రసాద్, కడప, న్యూస్ 18 తెలుగు.
నేటి యువతరానికి ఏ కొద్ది కష్టం వచ్చినా జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది.పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని, ఇంట్లోవాళ్లు ఏదో అన్నారని, ప్రేమలో విఫలం అయ్యారంటూప్రతి చిన్న కారణానికి ఆత్మహత్య చేసుకోవడం పరిపాటి అవుతూ వుంది. ఆవేశంలో ఆలోచన కరువై, వారు చేసే పనులకి ఇంటిల్లిపాది దుఃఖ సాగరంలో మునిగిపోవాల్సిన పరిస్థితిని ఏర్పడుతూ వుంది. అటువంటి సంఘటన నేడు మన కడప నగరంలో చోటు చేసుకుంది.
నగరానికి చెందిన ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఏమిటో తెలిదు పాపం...! ఒక యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని మరణించారు. వివరాల్లోకి వెళితే.కడప నగరంలోని ఊటుకూరు రైల్వే ట్రాక్ సమీపంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోనికి వచ్చింది. ఈ సంఘటన గురించిన సమాచారం అందుపోలీకుని సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే సులు విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆపై మృత దేహాన్ని వెంటనే కడప రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ సంఘటనపై రైల్వే ఇన్స్పెక్టర్ రారాజు అందించిన సమాచారం ప్రకారం మృతుడు నగరంలోని అక్కయపల్లి రవీంద్ర నగర్ ప్రాంతానికి చెందిన వాసి మొటికల వెంకట సాయిగా గుర్తించారు. అతను నగరంలో ఒక వాటర్ ప్లాంట్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడని తెలిపాడు. మృతుడికి సంబంధించిన సమాచారం అంతా సేకరించామని, ఆత్మహత్యకి చేసుకోవడానికి సంబంధించిన కారణాలని తెలుసుకుంటామని తెలిపారు. మృతుడి తల్లిదండ్రుల దగ్గర కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kadapa, Local News