హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

నంది వర్ధనాల సాగు.. అందంతో పాటు లాభాలు కూడా..!

నంది వర్ధనాల సాగు.. అందంతో పాటు లాభాలు కూడా..!

X
నందివర్ధనం

నందివర్ధనం సాగుతో లాభాలు

Kadapa: నంది వర్ధనం. ఈ పేరు వినగానే తెలిసిన చాలామందికి గుర్తోచే అంశం ఈ పువ్వు సౌందర్యం. స్వచ్చమైన తెలుపు రంగుని కలిగి ముద్దగా అందంగా వుంటుంది. ఈ పువ్వుల రెక్కలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Kadapa (Cuddapah), India

D Prasad, News18, Kadapa

నంది వర్ధనం. ఈ పేరు వినగానే తెలిసిన చాలామందికి గుర్తోచే అంశం ఈ పువ్వు సౌందర్యం. స్వచ్చమైన తెలుపు రంగుని కలిగి ముద్దగా అందంగా వుంటుంది. ఈ పువ్వుల రెక్కలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. సంవత్సరకాలం పూసే ఈ పువ్వులు వర్షాకాలం, ఎండకాలం ఎక్కువ పూస్తాయి. శీతాకాలంలో తక్కువగా పూస్తాయి. ఈ మొక్కలు సాధారణంగా మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఈ చెట్లని ఎక్కువగా ఇంటి పరిసరల్లో ఆకర్షణీయంగా కనిపించడానికి పెంచుకుంటారు. కానీ మార్కెట్లో ఈ పువ్వులకి ఉన్న డిమాండ్ మన తెలుగు రాష్ట్రాలలో అంతగా తెలియకపోవచ్చు కానీ కర్ణాటక (Karnataka), తమిళనాడు (Tamil Nadu) వంటి రాష్ట్రాలలో ఈ పువ్వులకి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఎ

ఈ పూలను పలురకాల వేడుకలలో అలంకరణలకి, పెళ్లిళ్లలో పూల జడలకు పూల దండలకి వాడుతుంటారు. నందివర్ధనాలతో చేసిన పూలజడలు, దండలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇక ఈ పువ్వుల ధర విషయానికి వస్తే బయటి రాష్ట్రాలలో ఈ పూలు కిలో సుమారు వెయ్యి నుండి రెండు వేలకి పై మాటే ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.

ఇది చదవండి: ష‌డ్రుచుల అంత‌రార్థం ఏంటో తెలుసా..! ఉగాది ప్రత్యేకతలివే..!

మార్కెట్లో మంచి ధరలు ఉండటంతో రైతులు కూడా నందివర్ధనాల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. కడప నగరంలోని అంగడి వీధికి చెందిన కృష్ణ ప్రసాద్ అనే యువకుడు చి రెండెకరాల్లో నంది వర్ధనం పూల సాగు చేస్తున్నాడు. కృష్ణ ప్రసాద్ స్వతహాగా పెండ్లిల్లకి పూల దండలు. పూల జడలు సప్లై చేస్తుంటాడు. ఇలా దండలు తయారు చేసే క్రమంలో ఈ నంది వర్ధనం పువ్వుల గురించి తెలుసుకున్న ఇతను ఇందులో ఆదాయాన్ని సాధించవచ్చనే ఆలోచనతో నంది వర్ధనం, గరుడ వర్ధనం పూల సాగు చేస్తున్నాడు.

రెండేళ్లుగా నంది వర్ధనం సాగు చేస్తున్న కృష్ణ ప్రసాద్ కి ఇప్పుడిప్పుడే ఈ తోట నుండి దిగుబడి వస్తోంది. రెక్కలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. ఏడాది పొడవన పూసే పూలకు మార్కెట్లో మంచి ధర వస్తోంది. శీతాకాలంలో దిగుబడి కాస్త తక్కువగా ఉంటందని ప్రసాద్ చెబుతున్నాడు. సరైన సాగు పద్ధతులు చేపడితో ఏకరానికి భారీగానే లాభాలు ఆర్జించవచ్చని పేర్కొన్నాడు.

First published:

Tags: Agriculture, Andhra Pradesh, Kadapa, Local News