D.Prasad, News18, Kadapa
ఈ మధ్య కాలంలో కొందరు ప్రజలు విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నగరంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అంతే కాకుండా చిన్న వయసులోనే చెడు స్నేహాలు చెడు అలవాట్లతో ముడి పడి చిన్న పొరపాట్లు మనస్పర్థలకు దారి తీస్తున్నాయి. ఈ పరిణామాలు యువతని వారి భవిష్యత్తుని, వారినే నమ్ముకుని బ్రతికే వారి తల్లిదండ్రులకి పుట్టెడు శోకాన్ని మిగిలిస్తున్నాయి. కడప జిల్లాలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ఒక యువకుడు అతి కిరాతకంగా చంపబడ్డాడు.
కడప నగరంలోని సాయిబాబా(SR theatre) సినిమా థియేటర్ సమీపంలో వున్న, రఘు వైన్స్ లో రేవంత్ (22) అనే వ్యక్తి గుర్తు తెలియని దుండగుల చేతిలో అతి దారుణంగా హత్యకి గురయ్యాడు. హత్య జరిగిన అనంతరం దుండగులు పారిపోయినట్లు సమాచారం.మృతి చెందిన రేవంత్ రాజారెడ్డి వీధికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. మృతుడితో పాటు అతని స్నేహితుడు అభిలాష్ అనే వ్యక్తికి కూడా గాయాలైనట్లు తెలుస్తుంది. అతడిని వన్ టౌన్ సి ఐ నాగరాజు రిమ్స్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.
మృతుడి వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు హృదయ విదారంగా విలపిస్తున్నారు. అధిక జన సంచారం కలిగిన ప్రాంతం కావడం చేత ఈ సంఘటన చూడడానికి అధికంగా జనాలు గుమిగూడారు.కేవలం 22 సంవత్సరాల వయసులో హత్య చేయబడ్డ రేవంత్ హత్య వెనుక గల కారణాలు ఏమై వుండచ్చు అనే కోణంలో పోలీసులు ఆలోచిస్తున్నారు. పాత కక్షలే కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కడప డిఎస్పీ వెంకట శివారెడ్డి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News