Breaking News: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekanada Reddy) హత్య కేసు (Murder Case) లో.. మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ (YCP) ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) అరెస్ట్ తప్పదా అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పులివెందులలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే పులివెందుల వెళ్లేందుకు అదనపు భద్రత కావాలని కడప (Kadapa) ఎస్పీని.. ఉన్నతాధికారులను కోరింది సీబీఐ. ముఖ్యంగా సీబీఐ నోటీసులపై స్పందించిన ఎంపీ అవినాష్ రెడ్డి.. విచారణకు ఐదు రోజుల సమయం కోరారు. దీంతో అప్రమత్తమైన సీబీఐ అధికారులు.. కడప నుంచి పులివెందులకు బయలు దేరారు.
అయితే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో తెలియక.. అదనపు భద్రత కోరినట్టు తెలుస్తోంది. భారీగా భద్రతతో సీబీఐ బృందం వస్తుండడంతో.. ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది.. అవినాష్ ను అరెస్ట్ చేయడానికే అదనపు భద్రత గురించి అడిగారా అని ఆయన అనుచరులు అనుమానాలు వ్యక్తం చేశారు.
అంతకుముందు ఈ సీబీఐ నోటీసులపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు. విచారణకు హాజరవ్వాలని కోరుతూ సీబీఐ అధికారులు సోమవారం నోటీసులు ఇచ్చారని.. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల షెడ్యూల్స్ ప్రకారం విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు సీబీఐ అధికారులకు వెల్లడించినట్లు తెలిపారు. విచారణకు హాజరయ్యి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని.. అయితే అయిదు రోజుల సమయం కావాలని కోరినట్లు చెప్పారు. తరువాత సీబీఐ ఎప్పుడు పిలిచినా విచారణకు తప్పకుండా హాజరవుతానని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తానని వెల్లడించారు.
ఇదీ చదవండి : విశాఖలో లోకేష్ ను కలుస్తా.. టీడీపీతో పొత్తు విషయంపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
అలాగే తన కుటుంబపై కొందరు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గత రెండున్నర సంవత్సరాలుగా తనపై, తన కుటుంబపై ఓ సెక్షన్ ఆఫ్ మీడియా అసత్యపు ఆరోపణలు చేస్తోందని అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వచ్చిన అభియోగాలు జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. తనేమిటో, తన వ్యవహార శైలి ఏంటో జిల్లా ప్రజలందరికీ బాగా తెలుసన్నారు. న్యాయం గెలచి, నిజానిజాలు వెల్లడి కావాలన్నదే తన కోరికన్నారు.
ఇదీ చదవండి: ఉద్యోగుల సంఘానికి నోటీసులు.. వారం రోజుల డెడ్ లైన్
మరోవైపు అధికార పార్టీ ఎంపీకి సీబీఐ నోటీసులు ఇవ్వడం.. ఆయన వెంటనే హాజరు కాకపోవడంపై రాజకీయంగా రచ్చకు కారణం అవుతోంది. తప్పు చేశారు కాబట్టి ఎంపీ షాకులు చెప్పి.. విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు అవినాష్ వెనుక ఉన్న పెద్ద తలకాయలను కూడా విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదీ ఏమైనా ఎన్నికలకు ముందు ఈ పరిణామం.. విపక్షాలకు ఒక రాజకీయ అస్త్రం దొరికినట్టు అయ్యింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Ys viveka murder case