GT Hemanth Kumar, News18, Tirupati
దాంపత్య జీవితం అంటేనే సంతోషాలు, సుఖదుఃఖాలు కలయికతో కూడిన బంధం. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సంసారంను సజావుగా సాగించి.., సమాజంలోఆదర్శంగా నిలుస్తుంటారు కొందరు. కానీ మరికొందరు మాత్రం అలా కాదు. పచ్చని కాపురాన్ని పిచ్చిపిచ్చి ఆలోచనలతో బుగ్గిచేసుకుంటుంటారు. భర్త తనతో సరిగా ఉండటం లేదనే కోపంతో అతడ్ని మార్చుకోవలసింది పోయి.. పక్కింటి అబ్బాయితోనో.. ఎదురింటి కుర్రాడితోనే వ్యవహారాలు నడుపుతున్నారు. అక్కడితో ఆగడంలేదు ప్రియుడితో కలిసి భర్త ప్రాణాలు బలిగంటున్నారు. ప్రియుడితో రాసలీలలు సాగిస్తున్న సమయంలో భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిందో భార్య. ఇలాంటి పనులు మానుకోవాలని.. ఇంకోసారి చేస్తే సహించేదిలేదని హెచ్చరించాడు. భర్త చెప్పిన మాటలు వినిపించుకోని ఆ మహాతల్లి.. ప్రియుడే కావాలనుకుంది. చివరకి ఏ భార్య చేయకూడని పని చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని వైఎస్ఆర్ కడప జిల్లా (YSR Kadapa District) బద్వేలు మండలం కొత్త చెరువు గ్రామానికి చెందిన గొడుగునూరు నారాయణకు ప్రకాశం జిల్లా (Prakasham District) కొమరోలు మండలానికి చెందిన ఉట్టి సునీత మహిళకు మధ్య వివాహేతర సంభంధం ఉంది. ఇద్దరూ మూడేళ్లుగా తమ సంభంధాన్ని కొనసాగిస్తున్నారు. ఓ రోజు సునీత తన ప్రియుడితో ఏకాంతంగా ఉండగా భర్త దేవ భూషణం కంటబడ్డారు. పద్ధతి మార్చుకోవాలని.. మరోసారి ఇలాంటి పనులు చేయవద్దని మందలించాడు.
ఐతే సునీత పద్ధతి మార్చుకోకపోవడంతో దేవభూషణం తరచూ భార్యతో గొడవకు దిగేవాడు. దీంతో తన సుఖానికి అడ్డొస్తున్న భర్తను చంపేయాలని భావించింది సునీత. వెంటనే ప్రియుడు నారాయణతో విషయం చెప్పింది. తాను చెప్పినట్లు చేస్తే ఎవరికీ అనుమానం రాదంటూ మర్డర్ స్కెచ్ ను వివరించింది. పథకం ప్రకారం ఓ రోజు దేవ భూషణం దగ్గరకు వెళ్లిన సునీత ప్రియుడు నారాయణ.. తన మరదలు సౌదీ వెళ్తోందని పార్టీ ఇస్తున్నానంటూ బైక్ ఎక్కించుకొని బద్వేలు తీసుకొచ్చాడు. అక్కడి నుంచి సిద్ధవటం వెళ్లి మద్యం కొన్నారు. రాత్రికి తిప్పనపల్లె సమీపంలోని ఎర్రవకం వద్ద మద్యం తాగారు.
పూటుగా మద్యం తాగి మత్తులో ఉన్న దేవభూషణంపై బండరాళ్లో దాడికి దిగాడు. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. తర్వాతి రోజు మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకున్నారు. ఐతే అట్లూరు ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద సీసీ ఫుటేజ్ ఆధారంగా మిస్టరీని చేదించారు. నిందితుడు నారాయణను తిప్పనపల్లె వద్ద అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన బండరాళ్లు, బైక్ ను స్వాధనం చేసుకున్నారు. కేసులో మరో నిందితురాలు ఉట్టి సునీతను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Extramarital affairs, Kadapa