హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

MLC Graduate Result: పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి డిక్లరేషన్.. మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

MLC Graduate Result: పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి డిక్లరేషన్.. మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ రాయలసీమ ఉత్కంఠకు తెర

పశ్చిమ రాయలసీమ ఉత్కంఠకు తెర

MLC Graduate Result 2023: పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వివాదానికి ఎండ్ కార్డు పడింది.. టీడీపీ ఆందోళనలు.. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యంతో.. వివాదానికి తెరదించారు అధికారులు.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెగ్గిన రాంగోపాల్ రెడ్డికి డిక్లరేషన్ అందించారు. దీనిపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur, India

MLC Graduate Result 2023: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) తీవ్ర ఉత్కంఠ రేపింది.. పశ్చిమ రాయలసీమ (West Rayalaseema) ఎమ్మెల్సీ అభ్యర్థుల ఫలితం.. చివరి వరకు నువ్వా నేనా అనేట్టు పరిస్థితి కనిపించింది. అయితే రెండో ప్రధాన్యత ఓట్ల లెక్కింపు లో.. అభ్యర్థుల ఎలిమినేషన్ మొదలైనప్పుడు.. వైసీపీ ఆధిక్యం తగ్గడం ప్రారంభమైంది.. చివరికి టీడీపీ అభ్యర్థి రాం గోపాల్ రెడ్డి (Ram Gopal Reddy) విజయం సాధించారు. అయితే ఈ ఫలితంపై టీడీపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అధికారులు తమ ఫిర్యాదులను పట్టించుకోలేదని.. వైసీపీకి వచ్చిన ఓట్ల బండిల్స్ ను టీడీపీ లోకలిపేశారని ఆరోపించారు.. ఆ ఆరోపణల మధ్యే టీడీపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు అధికారులు.. విజేతను అయితే ప్రకటించారు కానీ అర్థరాత్రి దాటినా అయనకు విన్నింగ్ డిక్లరేషన్ ఇవ్వలేదు. దీంతో అనుమానాలు వ్యక్తం చేసిన టీడీపీ నేతలు కౌంటింగ్ కేంద్రం దగ్గరే ఆందోళనకు దిగారు.. కలెక్టర్ వాహనాన్ని సైతం అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. అధికారుల తీరుపై టీడీపీ నేతలు.. ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ సభ్యుడు రాంగోపాల్ రెడ్డికి ఇవాళ కలెక్టర్ నాగలక్ష్మి డిక్లరేషన్ ఇచ్చారు. నిన్నే ఫలితాలు వెలువడినప్పటికీ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి గెలుపుపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులు డిక్లరేషన్ ఈ రోజు ఇచ్చారు. దీంతో రిటర్నింగ్‌ అధికారులపై టీడీపీ నేతలు మండిపడ్డారు.

మొత్తానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. మూడు స్థానాలను కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఫలితాలు టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పులివెందుల సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ గెలుపు.. ప్రజా విజయం అని, మార్పుకి సంకేతం అని టీడీపీ నేతలు చెబుతుంటే.. వారి వ్యాఖ్యలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి : పొత్తుల కోసం వెంపర్లెందుకు..? దమ్ముంటే 175 సీట్లలో పోటీ చేస్తారా? విపక్షాలకు జగన్ సవాల్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామన్న శునకానందం ఇంకొకటి ఉండదన్నారు.. గెలిచామని సంబరాలు చేసుకోవటం సిగ్గు చేటన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేయలేదన్నారు. వైసీపీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి సారి పోటీ చేసిందని గుర్తు చేశారు. అలాగే వైజాగ్ అభ్యర్థి చిరంజీవి ఇండిపెండెంట్ గా పోటీ చేసినా మంచి ఓట్లే వచ్చేవని.. అందుకే ఆయన కాళ్లు గడ్డాలు పట్టుకుని టీడీపీ వాళ్లు బతిమాలుకున్నారని ఆరోపించారు.

First published:

Tags: Andhra Pradesh, Ap mlc elections, AP News, TDP, Ycp

ఉత్తమ కథలు