Breaking News: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) అధికార వైసీపీ ఊహించిన షాక్ తగిలింది. ప్రతిపక్ష టీడీపీ (TDP) తీన్ మార్ ఆడింది. మూడు చోట్ల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు (Graduate MLC Elections) జరిగితే.. మూడు చోట్ల టీడీపీ విజయం సాధించింది. ముఖ్యంగా సీఎం జగన్ సొంత ఇలాఖా.. పశ్చిమ రాయలసీమలోనూ టీడీపీ గెలుపొందింది. నిన్న ప్రకటించిన ఫలితాల్లో రెండింటిని టీడీపీ కైవలం చేసుకుంది. అయితే మూడో స్థానంలో మాత్రం మొదటి నుంచి హోరాహోరీ పోరు కనిపిచింది. తొలి ప్రాధాన్యత ఓట్లలో వైసీపీ అభ్యర్థి రవీంద్రా రెడ్డి (Ravindra Reddy) ఆధిక్యంలో నిలిచారు.. అది స్వల్ప మెజార్టీ కావడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించడం తప్పని సరి అయ్యింది. అందుకే ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఇంత సమయం పట్టింది. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించడం ప్రారంభించిన దగ్గర నుంచి.. వైసీపీ ఆధిక్యం తగ్గుతూ వచ్చింది. మొత్తం 49 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. వీరిద్దరి మధ్యే ప్రధాన ఫైట్ టీడీపీ, వైసీపీ మధ్యే కనిపించింది.
రెండో రౌండ్ ఓట్లు పూర్తి అయ్యే సరికి టీడీపీ అభ్యర్ధికి భారీ ఆధిక్యం దక్కింది. ముక్యంగా బీజేపీ , పీడీఎఫ్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం వేసినవారిలో అత్యధిక మంది.. టీడీపీకే ఓట్లు వేశారు. వారిద్దరికి పడిన ఓట్లలో 60 శాతానికి పైగా టీడీపీకే రెండో ప్రాధాన్యం ఓట్లు పడడంతో ఆయన విజయం డిసైడ్ అయ్యింది.
మరోవైపు టీడీపీ అభ్యర్థి రామగోపాలరెడ్డి విజయం పై వైసీపీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఓట్లను టీడీపీ బండిల్ లో కలిపేశారని వైసీపీ అభ్యర్థి రవీంద్ర రెడ్డి ఆరోపించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన.. పట్టించుకోలేదని మండిపడ్డారు. విమర్శల సంగతి ఎలా ఉన్నా..? మూడుటికి మూడు టీడీపీ దక్కడం.. వైసీపీకి ఊహించని షాక్ తగిలినట్టు అయ్యింది. ముఖ్యంగా రాయలసీమలో వైసీపీ మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలు ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ రాయలసీమలోనే సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులు ఉంది. అక్కడ కూడా టీడీపీ అభ్యర్థికి భారీగా ఓట్లు పడ్డాయనే ప్రచారం జరుగుతోంది.
ఇదీ చదవండి : విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. రేపు వారందరి ఖాతాల్లోకి నగదు
మరోవైపు టీడీపీ విజయంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఏదో జరిగింది అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావు అని సజ్జల అన్నారు. పీడీఎఫ్, ఇతర వామపక్షాలకు చెందిన ఓట్లే టీడీపీ వైపు మళ్లాయన్నారు. ఎన్నికలు జరిగిన స్థానాలు అన్నింటినీ కలిపి చూడాలన్నారు. ఏ రకంగానూ ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిఫలించవు అన్నారు. టీడీపీ సంబరాలు చేసుకోవటంతోనే అంతా అయిపోలేదన్నారు ఈ ఫలితాలను తాము హెచ్చరికగా భావించడం లేదు. తెలంగాణ తరహాలోనే ప్రయత్నాలు టీడీపీ చేయొచ్చని. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్టని మరోసారి రుజువైంది అన్నారు. కౌంటింగ్ లోనూ టీడీపీ పాల్పడిన అవకతవకలను ఎన్నికల అధికారులు గుర్తించారన్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap mlc elections, AP Politics, Chandrababu Naidu, Sajjala ramakrishna reddy, TDP