హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

సిటీలోని వారికి ప్రశాంతత లభించేది ఇక్కడే.. వాట్ ఏ ప్లేస్..!

సిటీలోని వారికి ప్రశాంతత లభించేది ఇక్కడే.. వాట్ ఏ ప్లేస్..!

X
కడపవాసులకు

కడపవాసులకు ఆహ్లాదాన్నిస్తున్న అర్బన్ ఫారెస్ట్

నగర జీవనం అంటే ఎలా ఉంటుందో పెద్దగా చెప్పనక్కర్లేదు. ఎటు చూసినా కాంక్రీట్ భవనాలే.. భూతద్దం వేసి వెతికినా పచ్చదనం కనిపించదు. అందుకే నగరాల్లో ఉంటేవారు ప్రతి ఏటా ప్రశాంతత కోసం టూర్స్ వేస్తుంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Kadapa (Cuddapah) | Andhra Pradesh

D Prasad, News18, Kadapa

నగర జీవనం అంటే ఎలా ఉంటుందో పెద్దగా చెప్పనక్కర్లేదు. ఎటు చూసినా కాంక్రీట్ భవనాలే.. భూతద్దం వేసి వెతికినా పచ్చదనం కనిపించదు. అందుకే నగరాల్లో ఉంటేవారు ప్రతి ఏటా ప్రశాంతత కోసం టూర్స్ వేస్తుంటారు. ఐతే రోజువారీ జీవనంలో కాస్త మానసిక ఉల్లాసాన్ని కల్పించేందుకు నగరవనాలు చాలా ఉపయోగపడుతున్నాయి. చిన్నా పెద్ద సందడిగా చేరుకునే ప్రాంతంసెలవు దినాలలో అధిక ప్రాధాన్యతచిన్న పిల్లలని ఆకట్టుకునే ప్లే గ్రౌండ్, పెద్దల కొరకు ఓపెన్ జిమ్ ఇంటిల్లిపాది సరదాగా గడిపే సరైన ప్రదేశం.పచ్చని ప్రకృతిని పరిచయం చేసే అనేకమైన వన్య వృక్షాలు. పచ్చని ప్రకృతిలో గడపడానికి ఎవరికీ ఇష్టం ఉండదు..? చెప్పండి. కాని దానికి తగిన ప్రదేశం కావాలి, అనుకూలమైన సమయం ఉండాలని అనుకుంటున్నారా..! అయితే ఏది మీకోసమే..!

ప్రకృతి ఒడిలో తనివితీరా విశ్రాంతి తీసుకునే అవకాశం మన కడప (Kadapa City) నగరవాసులకి దక్కింది. వారం అంతా కష్టపడి వారాంతాల సెలవు దినాలలో ఇంటిల్లిపాదికీ సరదాగా గడపడానికి, పిల్లలు ఆనందంగా ఆడుకోవడానికి చక్కటి ప్రదేశం నగర వనం. అందమైన పచ్చని పాల కొండలు సమీపంలో, ఎంతో సౌందర్యవంతంగా ఏర్పాటు చేసిన ప్రదేశం ఈ పాల కొండలు 2019 వ సంవత్సరంలో ప్రభుత్వం, అటవీ శాఖ కలిసి ప్రజల సందర్శనార్థం ఈ నగర వనాన్ని ఏర్పాటు చేశారు.

ఇది చదవండి: ఇక్కడ నిద్ర చేసి కలలోకి ఊయల వస్తే సంతాన ప్రాప్తి క‌లిగిన‌ట్టే!

ఈ నగర వనం కడప నగర ప్రజలకు చేరువలో అందంగా ముస్తాబై ప్రశాంతంగా గడపాలనుకునేవారికి స్వాగతం పలుకుతుంది. ఈ నగర వనంలో అనేకమైన ఆటవీ వృక్షాలుతో పచ్చని ప్రకృతి వాతావరణాన్ని తలపించేలా శోభాయమానంగా తయారు చేశారు. మనం ఈ నగరవనానికి చేరుకోగానే మనకు వనదేవత అందంగా మనకు స్వాగతం పలుకుతుంది, అక్కడక్కడా వన్య మృగాల బొమ్మలు, వీటితో పాటు అరుదైన వృక్షజాతి మొక్కలు ప్రజలని ఆకట్టుకుంటాయి. రాశి వనం, వినాయక పాత్ర వనం, వేప వనం, యోగా సెంటర్, ఓపెన్ జిమ్, కిడ్స్ ప్లే ఏరియా, బటర్ ఫ్లై పార్క్, ఉసిరి వనం, ఫ్రూట్ గార్డెన్, లోటస్ పాండ్, దేవా కాంచన వనం వంటి ఈ వృక్షాలకి వాటి పేర్లు కనపడే విధంగా బోర్డ్ లని ఏర్పాటు చేశారు.

అనేకమైన వృక్షాలు వుండటం వలన ఈ ప్రదేశం చల్లగా మనస్సుకు ప్రశాంతత ను చేకూర్చే విషంగా ఉంటుంది. చిన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆట స్థలంలో ఉయ్యాలలు, జారుడు బండ వంటి అనేకమైన ఆట పరికరాలని పిల్లలకి అందుబాటులో ఏర్పాటు చేశారు.

First published:

Tags: Andhra Pradesh, Kadapa, Local News

ఉత్తమ కథలు