D.Prasad, News18, Kadapa
ఆ వ్యక్తికి ఎం కష్టం వచ్చిందో పాపం. ఎక్కడినుంచి వచ్చాడో తెలియదు, అతని పేరేంటో తెలియదు, బద్వేల్ నగర శివారులో, మనుషులు సంచరించని ప్రాంతంలో, పురుగుల మందు తాగి విగత జీవిగా మిగిలిన ఘటన అక్కడి స్థానికులను ఉలికిపాటుకు గురి చేసింది. బద్వేల్ నగరంలోని నెల్లూరు రోడ్ లో ఐ ఐ టి కాలేజి సమీపంలో, ఒక గుర్తు తెలియని వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని మరణించాడు.
ఆ వ్యక్తికి సుమారు 55 సంవత్సరాల వయస్సు ఉండవచ్చని గుర్తించారు. ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న బద్వేల్ పొలిసు యంత్రాంగం అక్కడకి చేసుకుని విచారణ చేపట్టారు. అక్కడ పడివున్న మృతదేహాన్ని పరిశీలించారు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాజంపేట సమీపంలోని ఊటుకూరు, కడప తిరుపతి రహదారి పక్కన ఒక మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన వెలుగు చూపింది. సంఘటన గురించి నిజానిజాలు తెలియాల్సి ఉండగా మృతి చెందినా మహిళా కడప నగరంలోని మేచంపేటకి చెందిన కళావతిగా పోలీసులు గుర్తించారు.
మంగళ వారం అనగా ఈ రోజు ఉదయం ఆమె మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు. ఆ తరువాత పోలీసులు సంఘటన స్థానానికి చేరుకుని కళావతి మృతికి కల కారణాలను తెలిపే ఆధారాలను కోసం వెతుకుతున్నారు. సంఘటనా స్థలంలో మద్యం సీసాలు, నిరోద్ ప్యాకెట్ లు ఉన్నట్లు గుర్తించారు. వీటిని ఆధారంగా చేసుకుని ఆమెను ఎవరైనా హత్య చేసి ఉంటారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News