హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Two Face Cow: బ్రహ్మంగారి మాటే నిజమవుతోందా..? 2 తలలతో పుట్టిన దూడ.. వినాయకుడి వరం అంటూ పూజలు

Two Face Cow: బ్రహ్మంగారి మాటే నిజమవుతోందా..? 2 తలలతో పుట్టిన దూడ.. వినాయకుడి వరం అంటూ పూజలు

రెండు తలల దూడ జననం

రెండు తలల దూడ జననం

Two Face Cow: బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానమే నిజం అయ్యిందా..? లక్ష్మీ దేవికి ప్రతిరూపంగా భావించే గోమత కు పుట్టిన దూడలు అందుకు కారణం అవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ఓ గోమాత.. రెండు తలలతో ఉన్న దూడకు జన్మనిచ్చింది. దీంతో ఆ దూడ వినయాకుడి వరం అంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kadapa (Cuddapah), India

  Two Face Cow: బ్రహ్మంగారు చెప్పినవన్నీ నిజం అవుతున్నాయా..? అందుకే ఎప్పుడూ చూడని వింతలు చోటు చేసుకుంటున్నాయా.. అంటే అవుననే అంటున్నారు కొందరు. ముఖ్యంగా హిందువులు (Hindus) గోమాతను లక్ష్మీ దేవికి ప్రతిరూపంగా భావిస్తుంటాం.. నిత్యం పూజలు చేస్తుంటాం.. కొందరైతే గోవుకి సైతం ఘనంగా సీమంతాలు చేస్తారు.. పుట్టిన దూడలకు వేడుకగా బాలసార కూడా చేస్తారు. ఇలా చాలామంది గోమాతను దైవంగానే భావిస్తారు.. కేవలం ఆవులను మాత్రమే కాదు.. గేదెలను సైతం అలానే భావిస్తారు. తాజాగా ఓ గేదె.. రెండు తలల దూడకు జన్మనిచ్చింది. అది కూడా వినాయక చవితి నాడు అలా రెండు తలల దూడ పుట్టడంతో అది.. వినాయకుడు వరం అంటున్నారు ఆ రైతు కుటుంబ సభ్యులు.. ఈ వింత ఘటన ఎక్కడ చోటు చేసుకుంది అంటే.. కడప జిల్లా (Kadapa District) బద్వేల్ మండలం (Badvel Mandal) బాలాయపల్లి (Balayapalli)లో వినాయకచవితి రోజున ఇలా రెండు తలల దూడ జన్మించింది.. బాలాయపల్లికి చెందిన మన్నెం శంకర్ రెడ్డి అనే రైతు ఇంట్లో గేదెకు రెండు తలల దూడ పుట్టింది. వినాయక చవితి రోజున రెండు తలల దూడ పుట్టడంతో దాన్నొక అద్భుతంగా భావిస్తున్నారు.

  ప్రస్తుతం ఆ తల్లి గేదె, రెండు తలల దూడ క్షేమంగా ఉన్నాయి. వినాయక చవితి పండగ రోజున పుట్టిన ఈ రెండు తలల దూడను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు. దైవ మహిమ వల్లే ఇలా జరిగిందని గ్రామస్తులు అంటున్నారు. వాటిని దైవ స్వరూపంగానే భావించి భక్తుతి నమస్కారాలు పెడుతున్నారు. మరికొందరైతే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానమే నిజమైంది అంటున్నారు.


  అయితే జన్యు పరమైన సమస్యల కారణంగానే ఇలా జరుగుతుందని పశువైద్యులు చెబుతున్నారు. ఇలా జన్యు లోపాలతో జన్మించే జీవుల మనుగడ కష్టం అని తెలిపారు. అయితే ఇలా వింత దూడలు జన్మించిన సందర్భాల గురించి మనం అరుదుగా వింటూనే ఉంటాం.

  కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం, రెడ్డి గూడెం మండలం, రుద్రవరం గ్రామంలో ఓ వింత చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం టున్నగరికపాటి వెంకటేశ్వరావు అనే రైతుల ఇంట్లో నెలల నిండిన ఓ ఆవు ప్రసవించగా రెండు తలలు ఉన్న దూడకు జన్మనిచ్చింది. అంతకుముందు కామారెడ్డిలోని పశువు కడుపులో మరో జాతికి చెందిన జంతువు పుట్టడం చూసి అక్కడి స్థానికులు ఆశ్చర్యపోయారు. అంతే కాదు అందుకు కాలజ్ఞానంతో ముడిపెట్టి విస్తృతంగా మాట్లాడుకుంటున్నారు. ఆ వింత జంతువును చూసేందుకు జనం తండోప తండాలుగా వస్తున్నారు. కామారెడ్డి(Kamareddy)జిల్లాలో పుట్టిన ఆ వింత జంతువు (Strange animal)గురించే ఇప్పుడు అందరూ చర్చించుకున్నారు

  ఇదీ చదవండి : వరుసాగా ఆరో నెల రికార్డ్ బ్రేక్.. తొలిసారి ఆ మార్క్ దాటిన ఆదాయం.. ఎంతో తెలుసా?

  మరోవైపు గతంలో పశ్చిమబెంగాల్‌లో ఓ ఆవు దూడ హాట్‌టాపిక్‌గా మారింది. ఒంటి కన్నుతో జన్మించింది. అయితే అది దైవ మహిమంటూ స్థానికులు పూజలు చేయడంతో.. అంతర్జాతీయంగానూ వార్తల్లోకెక్కింది. పశ్చిమ బెంగాల్‌లోని బర్దమాన్ జిల్లాలో ఈ వింత ఆవు దూడ జన్మించింది. ఒంటి కన్నుతో జన్మించడంతో అమ్మవారి మహిమంటూ స్థానికులు పూజలు చేస్తున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Cow, Cow video, Kadapa

  ఉత్తమ కథలు