రిపోర్టర్: ప్రసాద్
లొకేషన్: కడప
అందంగా ఊహించుకున్న జీవితం అర్ధాంతరంగా ముగిసింది. రేపటి గురించి కలలు కన్న ఆ యువ హృదయం అంతటితో ఆగిపోయింది.ప్రతి ఒక్కరికీ గుండెలు బరువెక్కించే హృదయ విధారక సంఘటన కడప నగరంలో చొడు చేసుకుంది.కడప శివానందపురానికి చెందిన హరి అనే యువకుడు ధర్మల్ లో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తూ జీవనం సాగించే యువకుడు అకారణంగా ఘోరమైన రైలు ప్రమాదానికి గురై మరణించిన సంఘటన ప్రతి ఒక్కరినీ కలచి వేసింది.రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా గూడ్స్ రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా కడప నగరంలోని 15 వ డివిజన్ శివానందపురం గ్రామానికి చెందిన కోడురు హరి అనే యువకుడు బుధవారం ఉద్యోగానికి బయలుదేరాడు. రైల్వే స్టేషన్ లో అతను వెళ్ళవలసిన సంపత్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలుని అందుకోవాలన్న ఉద్దేశంతో రైల్వే ట్రాక్ దాటుతుండగా.. గూడ్స్ రైలు ఢీ కొని అక్కడికక్కడే మరణించాడు.
మృతుడు హరికి వివాహం అయి కేవలం 45 రోజులు మాత్రమే కావొస్తోంది. ఈ విషయం స్థానికులను మరింత విచారానికి గురి చేసింది. ఇంకా కాళ్లకు పారాణి ఆరకముందే..హరి విగతజీవిగా మారటంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. వారి బంధువులు, భార్య రోదనలు అందరిని కలిచివేశాయి.ఈ రోజు మధ్యాహ్నం హరి మృతదేహనికి కుటుంబీకులు, స్నేహితుల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. ఏది ఏమైనా హరి అకాల మరణం కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Kadapa, Local News