హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: నేడు సొంత జిల్లాకు సీఎం జగన్.. పార్టీ వ్యతిరేకతపై ఆరా.. పూర్తి షెడ్యూల్ ఇదే

CM Jagan: నేడు సొంత జిల్లాకు సీఎం జగన్.. పార్టీ వ్యతిరేకతపై ఆరా.. పూర్తి షెడ్యూల్ ఇదే

వైఎస్ జగన్ (ఫైల్)

వైఎస్ జగన్ (ఫైల్)

CM Jagan Kadap Tour: సీఎం జగన్ సొంత జిల్లాపై ఫోకస్ చేశారు.. రేపు తండ్రి వైఎస్ఆర్ వర్ధంతి ఉంది. అందులో భాగంగా తండ్రికి నివాళులర్పించేందుకు వస్తున్న ఆయన.. మూడు రోజుల పాటు జిల్లాలోనే ఉండనున్నారు. పనిలో పనిగా జిల్లా రాజకీయాలపై పార్టీ నేతలతో చర్చించనున్నారు..!

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kadapa (Cuddapah), India

  CM Jagan Kadapa Tour: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సొంత జిల్లాపై ఫోకస్ చేస్తున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లా (Kadapa District)లోనే పర్యటించనున్నారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా రేపు నివాళులు అర్పించేందుకే జగన్ వస్తున్నా.. పనిలో పనిగా జిల్లా రాజకీయాలపైనా ఫోకస్ చేయనున్నారు. ముఖ్యంగా జిల్లాలో సొంత పార్టీలో వ్యతిరేకత పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం మూడు రోజుల పర్యటన ఆసక్తికరంగా మారింది.  ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్ తన నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.20 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు (Gannavaram Airport) కు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో 2.30 గంటలకు బయలుదేరి 3.20 గంటలకు కడప ఎయిర్ పోర్టు కు చేరుకుంటారు. 3.30 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 3.50 గంటలకు వేముల మండలంలోని వేల్పుల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ 4.05 వరకు స్థానిక నాయకులతో మాట్లాడుతారు.జిల్లాలో రాజకీయ పరిస్థితులు.. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలు.. అన్నింటిపైనా ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. ఇక సాయంత్రం 4.10 గంటల నుంచి సాయంత్రం 5.10 గంటల వరకు వేల్పులలోని సచివాలయం కాంప్లెక్స్ ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 5.35 గంటలకు హెలికాప్టర్ ద్వారా వేంపల్లె మండలంలోని ఇడుపుల పాయ గెస్ట్ హౌస్ కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. 


  రెండో రోజు పర్యటనలో భాగంగా 2వ తేదీ ఉదయం 8.50 గంటలకు ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ గెస్ట్ హౌస్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 9గంటలకు వైఎస్సార్ ఘాట్ కు చేరుకుంటారు. 9.40 గంటల వరకు వైఎస్సార్ ఘాట్ దగ్గర నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం జగన్ పాల్గొంటారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇడుపులపాయలో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి పనులపై అధికారులతో సీఎం జగన్ సమీక్షిస్తారు. సాయంత్రం 5.10 గంటలకు గెస్ట్ హౌస్ కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు.
  ఇదీ చదవండి : మెగా వినాయక సంబరాలు.. చిరంజీవి ఇంట్లో పూజ ఎలా జరిగిందో చూడండి..
  ఇక చివరిదైన మూడో రోజు.. అంటే 3వ తేదీ ఉదయం 8.50 గంటలకు ఇడుపుల పాయ ఎస్టేట్ లోని గెస్ట్ హౌస్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి అక్కడే ఉన్న హెలిప్యాడ్ వద్దకు 9 గంటలకు సీఎం వై.ఎస్. జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 9.15 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 9.20 గంటలకు ప్రత్యేక విమానంలో కడప నుంచి బయలుదేరి 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకొని తన నివాసానికి బయలుదేరి వెళ్తారు.
  ఇదీ చదవండి : మందులను దేవుడి ప్రసాదంలా సేవిస్తున్న బాలయ్య.. టీవీపై జోక్ వింటే పడి పడి నవ్వాల్సిందే
  అయితే ఈ పర్యటన కోసం సీఎం జగన్ రెండు కీలక సమావేశాలను రద్దు చేసుకోవడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మొదట 29వ తేదీన జరగాల్సిన కేబినెట్ భేటీ సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా పడింది. కానీ ఇప్పుడు కడప పర్యటన కారణంగా అది వాయిదా పడింది. అలాగే కేంద్రం ఆధ్వర్యంలో జరిగే దక్షిణ ఆర్థిక మండళ్లు సమావేశానికి సైతం జగన్ దూరమయ్యారు.. ఆయన స్థానంలో కేంద్రమంత్రితో కూడిన కమిటీని వెళ్లమని సూచించారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Kadapa

  ఉత్తమ కథలు