D Prasad, News18, Kadapa
మనం రోడ్డుమీదకు వెళ్లినప్పుడు మనమే కాదు.. ఎదుటివాళ్లు కూడా జాగ్రత్తగా రావాలి. ఏ చిన్న పొరబాటు జరిగినా నష్టం తీవ్రంగా ఉంటుంది. తాజాగా ఒకే రోజు జరిగిన అలాంటి ఘటనలు మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. కడప జిల్లా (Kadapa District) లో రోజు వారి ప్రమాదాల సంఖ్య పెరుగుతూ ఉంది. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో వాహన దారులకి ఎన్నో విధాలుగా అవగాహన కల్పిస్తున్నా కూడా ఫలితం లేకుండా పోతోంది. వాహనదారుల అతివేగం ఎందరో అమాయకుల ప్రాణాలను బలిగొంటుంది. జిల్లాలోని పలు ప్రాంతాలలో జరిగిన ప్రమాదాలలో వేరు వేరు చోట్ల ముగ్గురు మరణించారు. వీరిలో ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మరణించడం విశేషం.
కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఐలమ్మ కాలనీలో నివశిస్తున్న లక్షిదేవి అనే వివాహిత రోడ్డు దాటుతున్న సమయంలో అటుగా వస్తున్న లారీ అదుపుతప్పి ఆమెను ఢీ కొంది. ఈ ప్రమాద సంఘటనలో లక్ష్మీ దేవి అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సదరు విషయం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అలాగే కడప జిల్లా, మైదుకూరు మండలం వనిపెంట గురుకుల పాఠశాల సమీపంలో ఒక గుర్తు తెలియని వాహనం మోటార్ సైకిల్ నీ ఢీకొన్న ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతనిని విషమంగా ఉండటంతో వెంటనే అతనిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.చాపాడు మండలం లోని నక్కలదిన్నే సమీపంలో వున్న గుండ్లకమ్మ వంక వద్ద చేపలు పెట్టేందుకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాస్తు మృతి చెందాడు. చేపలు పట్టడానికి గుండ్లకమ్మ వంక వద్ద చేపలు పడుతూ వంకలో ఈత కొట్టే క్రమంలో షేక్ వలి అనే యువకుడు మృతి చెందినట్లు సమాచారం. ఈ విధంగా జిల్లాలో పలు రకాల ప్రమాదాలలో ముగ్గురు చనిపోవడం వారి కుటుంబాలలో విషాదాన్ని నింపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News, Road accidents