D Prasad, News18, Kadapa
కడప జిల్లా (Kadapa DIstrict). ఒకప్పుడు బ్రిటీషువారు పరిపాలనా కాలంలో నిర్మించిన అనేకమైన నిర్మాణాలు మనకు రోజు కనిపిస్తూ ఉంటాయి. అలాగే అప్పటి కాలం నాటి మరికొన్ని విశేషాలు జిల్లాలో ఉన్నాయి. అలాంటి ఒక నిర్మాణమే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ నిర్మాణం. నగర శివార్లలో బుగ్గ వంక నది ప్రవహిస్తూ ఉంటుంది, ఒకప్పుడు కడప జిల్లా తాగునీరు ఈ నది నుండే సరఫరా అయ్యేదని, ఇప్పుడు కూడా నగరంలోని కొద్ది ప్రాంతానికి నీటి సరఫరా ఇక్కడి నుండి జరుగుతుంది. ఈ బుగ్గ వంక నది ప్రవాహం నగరంలోనికి ప్రవేశించే ప్రాంతంలో ఒక నిర్మాణం సందర్శకులని ఆకట్టుకుంటుంది. అదే బ్రీటీష్ కాలం నాటి ఒక భూగర్భ నిర్మాణం.
ఈ నిర్మాణం భూగర్భంలో సుమారు 8 అడుగుల లోతులో వుంది. ఈ నిర్మాణం చూడడానికి అచ్చు భూమి లోపల నిర్మించిన గదులలాగే ఉంటుంది. ఈ నిర్మాణం గురించి వివరాల్లోకి వెళితే.., ఈ నిర్మాణం బుగ్గ గ్రామానికి సమీపంలో బుగ్గ వంక నది ప్రవాహ మార్గానికి ఎగువన నిర్మించబడింది. ఈ నిర్మాణం భూమికి ఒక రెండు అడుగుల ఎత్తులో ఉండి పై భాగాన అడుగు పరిమాణం కలిగన రంధ్రాలు ఉంటాయి.
ఇక లోపలి వైపు ఈ నిర్మాణాలని గమనించినట్లైతే లోపల గదుల వంటి నిర్మాణాలు ఉన్నాయి, నేడు ఈ ప్రాంతం అంతా గబ్బిలాలకి నివాసంగా మారి లోపలి ప్రాంతం బాగా మట్టితో నిండి ఉంది. ఈ నిర్మాణం గురించి స్థానికుల అందించిన సమాచారం ప్రకారం. అప్పట్లో బ్రిటీషు వారి పాలనా సమయంలో ఈ బుగ్గనది నుండి నీటి సరఫరా అయ్యేదని, అందులో భాగంగా నీటిని నిలువ చేయడానికి దీన్ని నిర్మించారని చెబుతారు.
తమ పూర్వీకుల కాలం నుండి ఈ నిర్మాణాలు ఇలాగే ఉన్నాయని... దీనిని కేవలం నీటిని నిలువచేసుకునే సంపులా వాడుకునే వారని.. ఇక్కడి నుంచే కడప నగరానికి మంచినీటిని సరఫరా చేసేవారని స్థానికులు వెల్లడించారు. ప్రస్తుతం ఇది శిథిలావస్థలో ఉండటంతో ప్రభుత్వం అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాల్లో చేర్చితే బావుటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News