హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Viveka Murder Case: వైసీపీ ఎంపీ చుట్టూ బిగుస్తున్న వివేకా హత్య కేసు ఉచ్చు.. అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

YS Viveka Murder Case: వైసీపీ ఎంపీ చుట్టూ బిగుస్తున్న వివేకా హత్య కేసు ఉచ్చు.. అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

ఎంపీ అవినాష్ రెడ్డి

ఎంపీ అవినాష్ రెడ్డి

YS Viveka Murder Case: రాజకీయాల్లో సంచలనంగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ మరింత స్పీడ్ పెంచింది. ఇప్పటికే వివిధ రూపాల్లో విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు.. ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kadapa (Cuddapah), India

YS Viveka Murder Case: సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (Ex Minister YS Vivekanand Reddy) హత్య కేసు (Murder Case) ముగింపునకు చేరుతున్నట్టే పరిణామాలు కనిపిస్తున్నాయి. తాజాగా మూడో సారి కడప ఎంపీ అవినాష్  రెడ్డి (Kadapa MP Avinash Reddy) సీబీఐ (CBI) నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే రెండు సార్లు ఆయన్ను విచారించి పలు రకాల ప్రశ్నలు వేశారు అధికారులు.. తొలిసారి విచారణకు హాజరైనప్పుడు పలు ప్రశ్నలకు ఎంపీ సమాధానాలు చెప్పలేదు. రెండోసారి కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటివేసినట్టు సమాచారం.. మొత్తం నాలుగు గంటల పాటు విచారిస్తే.. ఆయన్న కొన్నింటికే సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో మరోసారి ఆయన్ను విచారణకు హాజరు కావాలి అంటూ ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేశారు. పులివెందుల లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చారు సీబీఐ అధికారులు.

ఈ నెల 6వ తేదీన అంటే సోమవారం కచ్చితంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు సీబీఐ అధికారులు. హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అధికారులు వచ్చినప్పుడు ఎంపీ అవినాష్‌ ఇంట్లో లేకపోవడంతో ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డికి వారి చెప్పి వెళ్లినట్టు సమాచారం.

ఇప్పటికే అవినాష్‌ను రెండుసార్లు విచారించిన సీబీఐ.. ఇప్పుడు మరోసారి విచారించేందుకు సిద్ధమైంది. కాగా, వివేకా హత్య కేసులో మొదటి నుంచి ఎంపీ వైఎస్ అవినాష్ పై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులు ఆయన్ను విచారించారు. ఇక అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ నోటీసులు జారీ ఆయన కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది.

ఇదీ చదవండి : తెప్పపై రుక్మిణీకృష్ణుల అభయం.. తెప్పోత్సవం సంధ్య వేళలలోనే ఎందుకు నిర్వహిస్తారు? అసలు రహ్యసం ఏంటి..?

ఇప్పటికే ఈ కేసులో అన్ని వేళ్లూ అవినాష్ వైపునకు చూపిస్తున్నట్టు ప్రాచారం జరుగుతోంది. తాజాగా మరోసారి సీబీఐ విచారణకు రావాలని ఆదేశించిన నేపథ్యంలో మూడోసారి హాజరైతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సీబీఐ అధికారుల తీరుపై వైసీపీ కీలక నేతలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతా చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతోందని.. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అంత దారుణం మరొకటి ఉండదంటూ ఇటీవల సజ్జల వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి : 14 ఏళ్ల పాటు ఇల్లే జైలు కేసులో సరికొత్త ట్విస్టులు.. షాకిస్తున్న వాస్తవాలు

2019 మార్చి 15న వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో అనుమానాస్పదంగా వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. జిల్లాలో పార్టీ తరుపున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు కొన్ని గంటల ముందు.. ఆయన హత్యకు గురవడం సంచలనంగా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే అప్పుడు అధికారంలో ఉన్నటీడీపీ నేతలే హత్య చేయించారని అప్పటి ప్రతిపక్షమైన వైసీపీ ఆరోపణలు చేసింది. కానీ.. కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసుని విచారిస్తున్న సీబీఐ తెలంగాణ హైకోర్టులో బుధవారం దాఖలు చేసిన కౌంటర్ లో కీలక విషయాలు వెల్లడించింది. ఈ హత్య కేసులో నిందితుడైన యాదాటి సునీల్ యాదవ్ బెయిల్ పిటీషన్‌ను వ్యతిరేకిస్తూ సీబీఐ వేసిన పిటీషన్‌లో సంచలన విషయాలున్నాయి. అందులో భాగంగానే అవినాష్ రెడ్డిని మూడొసారి విచారణకు పిలిచినట్టు తెలుస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Kadapa, YS Avinash Reddy, Ys viveka murder case