టిటిడి (TTD)కి చెందిన ఒంటిమిట్ట (Vontimitta)లోని పురాతన చారిత్రకప్రాశస్త్యం గల శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమిబ్రహ్మోత్సవాలు (Srirama Brahmotsavaalu) వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10 నుండి 10.20 గంటల వరకు వృషభలగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. కంకణబట్టర్ శ్రీ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
వేలాదిగా తరలి వచ్చిన భక్తాదుల సమక్షంలో, అద్భుతమైన అలంకారాలతో ప్రారంభమయ్యాయి.మన రాష్ట్రంలోని అతి పెద్ద దేవస్థానం అయిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సాగుతున్న ఈ వేడుకలు, దేవాలయ పరిసరాలు అతి సుందరంగా ముస్తాబు చేయబడి. స్వామి ఆలయ గోపురాలు విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోతూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన శుక్రవారం రాత్రి శేషవాహనంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారు భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి భజన బృందాల కోలాటాల నడుమ పురవీధుల్లో వాహనసేవ జరిగింది.
జగన్ ను ఢీ కొడుతున్న రెబల్ ఎమ్మెల్యేలు.. రాజకీయ సునామి తప్పదంటూ వార్నింగ్.
అంగరంగ వైభవంగా కళాకారుల నృత్య ప్రదర్శనలు, కోలాటాలు వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలయ్యాయి. ఇవాళ స్వామివారి సన్నిధిలో ఆలయ శుద్ధి, ధ్వజారోహణం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. స్వామివారిని రంగు రంగుల పువ్వులతో అందంగా అలంకరించి భక్తుల దర్శనార్థం ఆలయం లో ఉంచడం జరిగింది. ఈ రోజు స్వామి వారి సన్నిధిలో జిల్లా అధికారులు మరియు పలు రాజకీయ నాయకులు స్వామివారిని సాంప్రదాయ పద్దతితో దర్శించుకుని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా స్వామి వారి సన్నిధిలో రాజంపేట ఎమ్మెల్యే పాల్గొని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగుండా చర్యలు తీసుకోవాలని అధికారులని ఆదేశించారు.స్వామివారి బ్రహ్మోత్సవాలకై తరలి వచ్చే భక్తుల సౌకర్యంకోసం ప్రభుత్వం చర్యలు తీసుకుని. ఈ వేసవి ని తట్టుకోవడానికి ఆలయ పరిసరాల్లో చలువ పందిర్లు ఏర్పాటు చేశారు అలాగే, వేసవి తాపం నుండి కాపాడడానికి దర్శన క్యు లైన్ల లో మంచినీరు మజ్జిగ సరఫరా చేస్తున్నారు. రేపు స్వామివారికి వేణుగానాలంకరణం, ఊంజల సేవ, రాత్రి హంసవాహన సేవలు జరగనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, Kadapa, Local News, Sri Rama Navami 2023