D.Prasad, News18, Kadapa
యువ క్రీడా ప్రతిభకి ఐపిఎల్ వేదిక కానుంది. మన జిల్లా నుండి ఒక యువ కెరటం, ప్రారంభం కానున్న మహిళా ఐపిఎల్ జట్టు ఎంపికకి సెలెక్ట్ అవడం జిల్లా ప్రజలకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఐపిఎల్ మన భారతీయ గడ్డపైన జరిగే అత్యుత్తమ క్రికెట్ టోర్నమెంట్. ప్రతి సంవత్సరం ప్రతి క్రికెట్ అభిమాని ఆత్రుతగా ఎదురు చూస్తూఉంటారంటే అందులో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ ఐపిఎల్ కి వున్న ప్రత్యేకత అలాంటిది. ఈ ఐపిఎల్ లో రాణించగలిగిన ఆటగాళ్ళు నేడు ఇండియా జట్టు తరపున అంతర్జాతీయంగా వారి ప్రతిభని కొనసాగిస్తున్నారు.ఇప్పటి వరకు కేవలం మగవారికి మాత్రమే సొంతమైన ఈ ఐపిఎల్ లీగ్, ఈ సంవత్సరం నుండి మహిళల సారధ్యంలో కూడా కొనసాగనుంది.
బిసిసిఐ వారు మహిళల కొరకు మహిళా ఐపిఎల్ ని ప్రారంభిస్తున్నారు. ఇది వరకే మన భారతీయ మహిళల జట్లు జాతీయంగా అంతర్జాతీయంగా అత్యద్భుతమైన ఆటతీరుని కనబరచడం వలన రానున్న మహిళా ఐపిఎల్ గురించి క్రీడా అభిమానులలో బారి అంచనాలు నెలకున్నాయి.అటువంటి ఈ ఈ మహిళా ఐపిఎల్ సంగ్రామంలో జట్టుతో కలిసి తలపడడానికి మన కడప జిల్లాకి చెందిన యువ క్రీడాకారిణి నల్లపురెడ్డి శ్రీ చరణి. ఈ మహిళా ఐపిఎల్ జట్టు ఎంపిక ప్రక్రియలకి సెలెక్ట్ అవడం జరిగింది.
శ్రీ చరణి కడప జిల్లా, ముద్దనూరు సమీపంలోని RTPP లో ఒక చిన్న కుటుంబం. వాళ్ళ నాన్న అక్కడి RTPP లో ఉద్యోగస్థుడు, అమ్మ గృహిణి. శ్రీ చరణిచిన్నప్పటి నుండి క్రికెట్ మీద మక్కువతో ఇంట్లో అమ్మ, నాన్న ప్రోత్సాహంతో క్రికెట్ లో రాణించింది. చిన్నప్పటి నుండి మామ కిషోర్ ని గురువుగా చేసుకుని క్రికెట్ లోని మెళకువలను నేర్చుకుంటూ అంచెలంచెలుగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నుండి తన ప్రతిభని కనబరుస్తూ నేడు ఇలా మహిళల ఐ ఫై ఎల్ ఎంపిక ప్రక్రియలకి సెలెక్ట్ అయింది.
ఈ విధంగా మన కడప జిల్లా చెందిన ఒక క్రీడాకారిణి ఒక ఉన్నత స్థానానికి చేరుకొని రేపు జరగబోయే జట్టు ఎంపిక ప్రక్రియలో ఎంపిక కావాలని ఆశిద్దాం..! ఇలాగే ఎన్నో ఉన్నత శిఖరాలని అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Cricket, Kadapa, Local News, Sports, WPL 2023