జిల్లాలో అతి దారుణమైన ప్రమాద సంఘటన వెలుగు చూపింది. నగర శివార్లలో వల్లూరు వద్ద, కడప తాడిపత్రి జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే... నగరం నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో వల్లూరు కలదు. ఈ గ్రామం పక్కనే కడప తాడిపత్రి జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం ఏడు గంటలకురహదారిపై వెళుతున్న ఒక బైకుని గుర్తు తెలియని ఒక వాహనం ఢీ కొన్న ఘటన ఇక్కడి ప్రజలని కలచివేసింది.
ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించగా మరొకరికి తీవ్రగాయాలైనట్లు సమాచారం.మృతుడు వల్లూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో నివసించే సురేంద్ర (30) గా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రున్ని 108 వాహనంలో కడప రిమ్స్ కు తరలించారు.ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న బంధువులు, ఊరి ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు.
మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ ప్రమాద సంఘటన చూడడానికి అక్కడికి వచ్చిన ప్రజలతో రహదారి నిండిపోయింది. దీనితో అక్కడి వాతావరణం గందరగోళంగా మారింది. వాహనాల రాకపోకలు చాలావరకు నిలిచిపోయాయి. ఈ సంఘటనకి సంబందించిన నిజా నిజాలు అదే విధంగా మృతుని, క్షతగాత్రుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అక్కడి ప్రాంతంలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News