D.Prasad, News18, Kadapa
జిల్లాలో రోజు రోజుకి రహదారులపై దారుణమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మద్య కాలంలో చూసినట్లయితే జిల్లా వ్యాప్తంగా అనేకమైన రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో కొన్ని దారుణమైనవి మరికొన్ని అతీ దారుణమైన రోడ్డు ప్రమాదాలుగా చెప్పవచ్చు. ఈ విధంగా ప్రమాదానికి గురై అనేక కుటుంబాలు నేటికి శోక సంద్రంలో నిండి ఉన్నాయి.ఇటివల కడప జిల్లా ఒంటిమిట్ట మండలం, కడప - రేణిగుంట జాతీయ రహదారి పైన మంగంపేట ఆంజనేయ స్వామి గుడి - ఇరుకుబోటుకు మధ్య ప్రాంతంలో తిరుమల దర్శనానికి వెళుతున్న యాత్రికుల కారుకి ప్రమాదం జరిగిన సంఘటన పరివాహక ప్రాంతాలలో అలజడి సృష్టించింది.
తిరుమల శ్రీవారి దర్శనం కోసమని తెలంగాణా రాష్ట్రం లోని మహబూబ్ నగర్ జిల్లా, భూత్పూర్ మండలం, షాపూర్ గ్రామమునకు చెందిన 7 మంది యాత్రికులు వారి ఇంటి నుండి బయల్దేరారు. సరిగ్గా ఆదివారం తెల్లవారుజామునకడప జిల్లా ఒంటిమిట్ట మండలం, కడప - రేణిగుంట జాతీయ రహదారి పైన మంగంపేట ఆంజనేయస్వామి గుడి – ఇరుకుబోటుకు సమీపంలోనికి రాగానే వ్యతిరేక దిశలో వస్తున్న లారీవీరు ప్రయాణిస్తున్న కారుని డీ కొట్టడం వలన ఘోరమైన ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఒంటిమిట్ట పోలీసులకు సమాచారం అందించడం వలన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరొకతను చికిత్స పొందుతూ మరణించారు. మిగిలిన వారు తీవ్ర మైన గాయాలతో బయటపడ్డారు. మృతులు, గాయపడిన వారి వివరాలు కింది విధంగా ఉన్నాయి.
వంశీకృష్ణ 24 సంవత్సరాలు ప్రమాద స్థలంలో మరణించగా నరేష్, 24 సంవత్సరాలు వైద్య చికిత్స తీసుకుంటూ మరణించారు. మిగిలిన వారు హనుమంతు(24) కృష్ణవేణి, (20) బిందేశ్వరి (19) రాము (25) తీవ్రమైన గాయాలతో బయటపడ్డారు. వెంకటేష్ (23) ఎటువంటి గాయం లేకుండా బయటపడ్డాడు. గాయపడిన వారిని వెంటనే అంబులెన్స్ సహాయంతో కడప ప్రభుత్వ ఆసుపత్రి రిమ్స్ కి తరలించారు.
ఈ ప్రమాదంలో కారు నుజ్జు అవడం వలన అందులో మృతి చెందిన వంశి కృష్ణ మృతదేహం చిక్కుకు పోయింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా వుండటం చేత రహదారిలో వాహనాల రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. ఒంటిమిట్ట పోలీసుల సహాయక చర్యలతో వాహనంలో ఇరుక్కున్న మృతదేహాన్ని జేసీబీ సహాయంతో తీయించి, ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Road accident, Vijayawada