హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kadapa: జిల్లా వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు

Kadapa: జిల్లా వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు

ఘనంగా వేడుకలు

ఘనంగా వేడుకలు

Andhra pradesh: జిల్లాలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర వేడుకలను పురస్కించుకుని నగరంలోని పలు చోట్ల గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

D.Prasad, News18, Kadapa

జిల్లాలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర వేడుకలను పురస్కించుకుని నగరంలోని పలు చోట్ల గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల సంబరంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు.

నగరంలో ప్రత్యేక ఆకర్షణగా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో పోలీస్ పెరేడ్ గ్రౌడ్లో ఏర్పాటు చేసిన పలురకాల కార్యక్రమాలు ప్రజలని విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పలు రకాలైన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందులో ప్రధానంగా ఆటవి శాఖ, వ్యవసాయం, నీటిపారుదల, రైతులు, ప్రభుత్వ పథకాలు, విద్యుత్ శాఖ, వైద్య శాఖ, ఫైర్ శాఖ వంటి పలు రకాల శకటాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పోలీసు కవాతు, వారు మోటార్ సైకిళ్ళుపై నిర్వహించిన విన్యాసాలు నగర ప్రజలని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నగరంలోని పాఠశాలల విద్యార్థులు. నగర ప్రజలు ఆసక్తిగా పాల్గొన్నారు.

ప్రొద్దుటూరు పట్టణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిలవగా, ప్రత్యేకంగా శివాలయం సెంటర్ లో మున్సిపల్ కార్పొరేషన్ వారి నిధులతో ఏర్పాటు చేసిన వంద అడుగుల శాశ్వత త్రివర్ణ పతాకం ప్రముఖ ఆకర్షణగా నిలిచింది. నగరంలో శివాలయం సెంటర్ ఆ పరిసర ప్రాంతాలకు ఈ వంద అడుగుల త్రివర్ణ పతాకం ప్రధాన ఆకర్షణ. ఈ వంద అడుగుల త్రివర్ణ పతాకాన్ని ఉదయం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి చే ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రజలు, విద్యార్థులు, అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని.. స్థానిక జిల్లా కలెక్టర్ బంగ్లా ప్రాంగణంలో గురువారం సాయంత్రం అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో... కన్నుల పండువగా ప్రారంభమైన \"అట్ హోమ్\" కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఏర్పాటు చేసిన.. ఈ తేనీటి విందులో జిల్లా ఎస్పీ కెకెఎన్.అన్బు రాజన్ తో పాటుగావివిధ అధికారులు హాజరయ్యారు. ఈకార్యక్రమంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ... రాజ్యాంగ స్ఫూర్తితో దేశ సమైక్యత సమగ్రత కొరకు, అన్ని రంగాలలో జిల్లా అభివృద్ధికి ఐక్యంగా కృషి చేద్దామన్నారు. విధులు బాధ్యతలను నిబద్ధతతో నిర్వదిద్దామన్నారు.

74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో శకటాల ప్రదర్శనలోమొదటి బహుమతి గా వ్యవసాయ, అనుబంధ శాఖల శకటం,2 వ బహుమతిగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారికి.3వ బహుమతిగా విద్యుత్, ఇంధన వనరుల శాఖ వారికి. అటవీ శాఖ, పంచాయతీ రాజ్, జిల్లా పరిషత్, ఆర్ డబ్ల్యు ఎస్, హోసింగ్ శాఖలు కన్సోలేషన్ బహుమతులు పొందాయి.

First published:

Tags: Andhra Pradesh, Kadapa, Local News

ఉత్తమ కథలు