జిల్లాలో ఎర్రచందనం అక్రమార్కుల పై కన్నేసిన జిల్లా పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఆరుగురు ఎర్రచందనం దొంగలను అదుపులోనికి తీసుకున్నారు. వీరి వద్దనుండి, 7,16,000 విలువ గల 19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.ఈ సంఘటనకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కడప జిల్లా పెండ్లిమర్రి మండలం, నంది మండలానికి చెందిన అల్లు సుధాకర్, కోట శ్రీనివాసులు షేక్ హుస్సేన్ పీరా, పబ్బతి ఓబులేసు, ఖాజీపేట పూసల కొట్టలకు చెందిన మోటు శ్రీనివాసులు, బాల్నేని గంగయ్య అనే ఆరు మందిని పెండ్లిమర్రి మండలం, నంది మండలం దక్షిణ దిశలో ఏడు కిలోమీటర్ల వద్ద ఉన్న బావికోన కొండ దగ్గర 6 మంది ఎర్రచందనం దుంగలను భుజాన వేసుకుని తరలిస్తుండగా ముందస్తు సమాచారం అందుకున్న కడప రూరల్ సీఐ కె అశోక్ రెడ్డి , పెండ్లి మర్రి ఎస్ఐ ఎన్ రాజరాజేశ్వర్ రెడ్డి వారి సిబ్బందితో దాడి చేశారు.
పోలీసులు దాడి చేసిన విషయం తెలుసుకున్న నిందితులు పోలీసులపై ప్రతిదాడి చేయడం ప్రారంభించారని, వారి వద్ద ఉన్న గొడ్డలతో రాళ్లతో పోలీసులపై దాడి చేయడంతో, పోలీసులు నిందితుల నుండి చాకచక్యంగా తప్పించుకుని అదుపులోకి తీసుకున్నామన్నారు.
వారివీరి వద్దనుండి, 7,16,000 విలువ గల 19 ఎర్రచందనం దుంగలు, రెండు గొడ్డళ్లు, రెండు మోటర్ సైకిల్లు, ఐదు సెల్ ఫోన్లు నాలుగు రాళ్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా డి.ఎస్.పి వెంకట శివారెడ్డి మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణా చేసే వారికి కతిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఈ కేసులో మిగతా ముద్దాయిల కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, త్వరలో వారిని కూడా పట్టుకుని శిక్షిస్తామని ఆయన తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా కట్టడికి కృషి చేసిన కడప రూలర్ సిఐ అశోక్ రెడ్డిని, పెండ్లి మర్రి ఎస్ఐ ఎన్ రాజరాజేశ్వర్ రెడ్డి మరియు వారి సిబ్బందిని ఆయన అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News