D Prasad, News18, Kadapa
కడప జిల్లా (Kadapa District) వేంపల్లె పట్టణంలో గత రెండు నెలల నుండి గుర్తు తెలియని వ్యక్తులు హల్ చల్ చేస్తున్నారు..రాత్రికి రాత్రే ఏవి కనబడితే అవి...దోచుకెళ్లరు...కానీ దగ్ధం చేసేస్తున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడుతున్నదని ఎవరా అనేది పట్టుకోవాలని ప్రయత్నం చేసినా దొరకటం లేదు. చూడండి.. ఇలాంటి ఘటనలతో వేంపల్లిలోని ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. గత రెండు నెలలుగా వేంపల్లె పట్టణంలో సుమారు మూడు కార్లు, ఆరు, బైక్ లకి నిప్పుకి ఆహుతైన గతి పట్టింది. కాని ఇప్పటి వరకు ఇలా చేస్తుంది ఎవరో బయటపడలేదు. ఇప్పటికి పోలీసులు ఇప్పటికి ఆ అపరిచిత వ్యక్తి ఎవరా అని వెతుకుతూ ఉన్నారు. కాని ఆ అపరిచిత వ్యక్తి మాత్రం ఇలా కార్లకి, బైక్ లకి నిప్పు పెట్టడం ఇంకా మానుకోవట్లేదు.
ఇటీవల ఇలాంటి సంఘటన వేంపల్లి పట్టణంలో పునరావృతం అయింది. వేంపల్లె పట్టణానికి చెందిన సంతోష్ కుమార్ ఎప్పటిలాగే తనకు చెందిన షిఫ్ట్ డిజైర్ కారుని రాత్రి సమయంలో పార్క్ చేశారు. తరువాత చూస్తే ఆ కారుకి నిప్పంటుకుంది. ఈ సంఘటన అక్కడ కొత్తేం కాదు. గత రెండు నెలలుగా వేంపల్లెలో ఇదే తంతు జరుగుతూ వుంది. ఇలా నిప్పు పెట్టె ఆగంతకుడు ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావట్లేదు.
అతను కావాలనే ఇదంతా చేస్తున్నాడా లేదా మతిస్థిమితం సరిగా లేక ఇలా చేస్తున్నాడా అనే విషయం పోలీసులకి పెద్ద సవాల్ గా మారింది. ఇటీవల ఆగంతకుడు కారుకు నిప్పు పెట్టే దృశ్యాలు ఎట్టకేలకు సీసీ కెమెరాలకు చిక్కాయి. దీని ఆధారంగా పోలీసులు అ వ్యక్తి కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ దుండగుడు సీసీ కెమెరాలకు చిక్కడంతో వేంపల్లి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించిన పోలీసులు ఆగంతకుడు వేంపల్లి వాసిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కార్లకి బైక్ లకి నిప్పుపెడుతున్న నిందితున్ని త్వరలోనే పట్టుకుని ప్రజల ముందుకు తీసుకువస్తామని పోలీసులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News