D.Prasad, News18, Kadapa
మన సమాజంలోని ప్రజలు ఏచిన్న కష్టం వచ్చిన మొట్టమొదటిగా వారు ఆశ్రయించే వ్యక్తులు పోలీసులు. వారి రక్షణలో జనాలు సంతోషంగా బ్రతుకుతున్నారు. మరి అలాంటి పోలీసులు ఏకంగా చనిపోవాలనుకున్న ఒక మహిళా ప్రాణాన్ని ఒక పోలిస్ తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా సాహసోపేతంగా ఆమెని కాపాడి ఆదర్శంగా నిలిచాడు.ప్రజల మన్ననలు అందుకున్నాడు. చనిపోవాలనుకున్న ఆమెకి తిరిగి పునర్జన్మని ప్రసాదించిన దైవంగా నిలిచాడు.ఈ సంఘటన బ్రహ్మంగారి మఠం మండలంలో చోటు చేసుకుంది
ఇక వివరాల్లోకి వెళితే.చీటిల వ్యాపారంతో నష్టపోయిన బద్వేల్ పట్టణానికి చెందిన జులేఖా(45) మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవాలి నిర్ణయించుకుంది. అందుకోసం ఆమె బ్రహ్మంగారి మఠం లోని బ్రహ్మం సాగర్ కి చేరుకొని, నీటిలో దూకి ఆత్మహత్యకి పాల్పడింది. అదే సమయంలో విధులు ముగించుకొని బ్రహ్మ సాగర్ వైపు వెళుతున్న బ్రహ్మంగారి మఠం పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ వెంకటరమణ, నీటిలో ఆత్మహత్య చేసుకుంటున్న జులేఖా ను చూసి వెంటనే సాహసోపేతంగా నీటిలోకి దూకి జులేఖాను రక్షించాడు.
అనంతరం జులేఖాను సురక్షితంగా పోలీస్ స్టేషన్ కు తరలించాడు. అక్కడ బ్రహ్మంగారి మఠం ఎస్.ఐ విద్యాసాగర్ ఆమె వివరాలు తెలుసుకుని ఆమెని కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది.సాహసోపేతంగా వ్యవహరించి తన తల్లి ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్ వెంకటరమణ కు కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం పోలీస్ శాఖకు రుణపడి ఉంటామన్నారు. శభాష్..పోలీస్ అంటూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు బ్రహ్మంగారి మఠం పోలీస్ కానిస్టేబుల్ వెంకటరమణ..
మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ వెంకటరమణ ను జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ప్రత్యేకంగా అభినందించారు. స్ఫూర్తిదాయక సేవలందించి జిల్లా పోలీస్ శాఖ ఔన్నత్యాన్ని మరోసారి చాటారని ఎస్పీ పేర్కొన్నారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News