Prasad,Kadapa, News 18 Telugu,
వై.ఎస్.ఆర్ జిల్లాలో ప్రారంభమైన కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక పరీక్షల ప్రక్రియను పరీక్షా కేంద్రాలలో తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ కె.కె.ఎన్ అన్బురాజన్ కడప నగరంలోని కోటిరెడ్డి మహిళా డిగ్రీ కళాశాలను, అనంతరం చింతకొమ్మదిన్నె మండలం లోని KSRM ఇంజనీరింగ్ కళాశాల కేంద్రాన్ని సందర్శించి అక్కడ పరీక్షల తీరును చెక్ చేశారు.పరీక్షా కేంద్రాల్లోకి వెళ్తున్న అభ్యర్థుల హాల్ టికెట్లు, గుర్తింపు కార్డులను ఎస్పీ గారు స్వయంగా సరి చూశారు.
ప్రతీ అభ్యర్థిని అక్కడే విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది ప్రిస్కింగ్ చేయడం, తదితర విధులను ఎస్పీ పర్యవేక్షించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు లోని మొత్తం 71 కేంద్రాల్లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రిలిమినరి పరీక్షలు జరుగుతున్నాయని, పకడ్బంది భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.
ప్రతి సెంటర్ లో ఒక ఎస్.ఐ, 10 మంది సిబ్బంది తో పకడ్బందీ గా భద్రతా ఏర్పాటు చేయడం జరిగింది.జిల్లా లోని కడప, ప్రొద్దుటూరులోని పరీక్ష కేంద్రాల్లో 800 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది తో బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్.పి శ్రీ కె.కె.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ తెలిపారు.
ప్రతి రెండు సెంటర్లకు సి.ఐ స్థాయిలో, ప్రతి నాలుగు సెంటర్లకు డి.ఎస్.పి స్థాయిలో ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఏర్పాటు చేశామని ఎస్.పి తెలిపారు.అభ్యర్థులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్.పి వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, YSR