(ప్రసాద్, న్యూస్18 తెలుగు, కడప జిల్లా)
బుధవారం జంట హత్యలతో ఒక్క సారి కడప నగరం ఉలిక్కి పడింది. ఇద్దరు యువకులనుగుర్తు తెలియని వ్యక్తులుహత్య చేసిన విషయం మనకు తెలిసిందే. అందులో ఒకరు అదే రోజు రాత్రి చనిపోగా మరొక యువకుడు రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించాడు.ఈ కేసుని పట్టుదలగా చేసుకుని దర్యాప్తు చేపట్టిన నగర పోలీసులు, ఈ సంఘటన జరిగి 24 గంటలు గడవక ముందే ఈ కేసుని ఛేదించారు.
హత్యకి కారణమైన ముగ్గురు నిందితులని పట్టుకుని మీడియా ముందుకు ప్రవేశ పెట్టారు.పోలీసుల కథనం ప్రకారం బుధవారం రాత్రి రఘు బార్ లో మద్యం సేవించిన తరువాత మద్యం మత్తులో వున్న రేవంత్ మరియు అభిలాష్లపై ముగ్గురు వ్యక్తులు హత్యకి పాల్పడ్డారని. పాత కక్ష్యలే ఈ హత్యలకి ప్రధాన కారణం అని పోలీసులు వెల్లడించారు.
నిందితులు నగరానికి చెందిన శ్రీరాములు గంగాధర్, శ్రీరాములు రాఘవ, ఖాదర్ వల్లిలుగా నిర్ధారించారు. వీరి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు, మోటార్ సైకిల్ లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇలాంటి సంఘటనల మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని. ప్రత్యేకంగా అల్లరి మూకల మీద నిఘా ఉంచడం జరిగిందని, ఈ సందర్భంగా కడప డిఎస్పీ వెంకట శివారెడ్డి వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా కేవలం 24 గంటల లోపే ఛేదించి నిందితులని పట్టుకున్న వన్ టౌన్ సీఐ నాగరాజు, ఎస్సై పెద్ద ఓబన్న, వారి సిబ్బందిని కడప డిఎస్పి అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Kadapa, Local News