హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

పులివెందులలో సంచలనం.. పట్టపగలు నడిరోడ్డుపై..

పులివెందులలో సంచలనం.. పట్టపగలు నడిరోడ్డుపై..

పులివెందులలో కాల్పుల కలకలం

పులివెందులలో కాల్పుల కలకలం

వైఎస్సార్‌ కడప జిల్లా (YSR Kadapa District)లోని సీఎం జగన్ (AP CM YS Jagan)‌ సొంత నియోజకవర్గo, అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న పులివెందుల (Pulivendula) లో తుపాకీ కాల్పుల ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Pulivendla (Pulivendula), India

D Prasad, News18, Kadapa

వైఎస్సార్‌ కడప జిల్లా (YSR Kadapa District)లోని సీఎం జగన్ (AP CM YS Jagan)‌ సొంత నియోజకవర్గo, అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న పులివెందుల (Pulivendula) లో తుపాకీ కాల్పుల ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. పులివెందుల పట్టణంలో వివేకా హత్య కేసుకి సంభందించి సీబీఐ అధికారులు గతంలో పలుమార్లు విచారన చేపట్టిన భరత్‌కుమార్‌ యాదవ్‌ ఈ కాల్పులకు తెగబడ్డ వ్యక్తిగా గుర్తించారు. ఈ తుపాకీ కాల్పుల సంఘటనలో ఇరువురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం పులివెందుల లోని ఆస్పత్రికి తరలించారు.పులివెందుల పట్టణంలో ఎప్పుడు రద్దీగా ఉండే వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలోనీ బి యస్ ఎన్ ఎల్ కార్యాలయం దగ్గర, దిలీప్, మస్తాన్ అనే భావ భామ్మర్ధుల మీద భరత్ కుమార్ తుపాకితో కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలో ఇరువురికి తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో వారిని పులివెందుల ఏరియల్ హాస్పిటల్ కి తరలించగా. అక్కడి వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం దిలీప్ ని హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్లు సమాచారం. ఈ సంఘటనకి సంబంధించి భరత్‌ కుమార్, దిలీప్‌ మధ్య ఆర్థిక వివాదాలే ఈ ఘటనకు ప్రధాన కారణంగా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఇది చదవండి: కోడలిపై కన్నేసిన మామ.. ఇద్దరు అత్తలు అదే టైప్.. చివరికి..!

ఈ ఆర్థిక లావాదేవీలకి సంభందించి ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో, భరత్ కుమార్ తన ఇంటి వద్ద నుంచి తుపాకీ తీసుకొచ్చి దిలిప్ మరియు మస్తాన్ మీద కాల్పులు జరిపినట్టు సమాచారం. భరత్ ‌కుమార్‌ యాదవ్ ‌ను వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు గతంలో విచారించారు. కాల్పులు జరిపిన సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, Kadapa, Local News, Pulivendula

ఉత్తమ కథలు