CM Jagan Humanity: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి మానవత్వం చూపించడంలో ముందు ఉంటున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో స్పాట్ లో స్పందించి సాయం చేస్తున్న ఆయన.. తన కడప జిల్లా పర్యటనలో వరుసగా రెండో రోజు కూడా మరో బాధితుడికి అపన్నహస్తం అందించారు. తన సాయం కోరే వారికి తనవంతు సాయం చేయడం జగన్ కి తెలిసినంతగా ఎవరికీ తెలియదని నిరూపించుకుంటున్నారు. తన సొంత జిల్లా కడపలో ఆయన రెండో రోజు పర్యటించారు. రెండో రోజు పర్యటనలో భాగంగా ఇడుపులపాయ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. తరువాత పులివెందుల కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించారు. అలాగే నూతనంగా నిర్మించిన డాక్టర్ వైయస్‌ఆర్ బస్ స్టాండ్‌ను ప్రారంభించారు. రాజంపేట నుంచి వచ్చిన దేవర అనంతగిరి అనే యువకుడు జగన్ ని కలవాలని ప్రయత్నించాడు.
ఓ యాక్సిడెంట్ కారణంగా ఆ యువకుడి నరాలు వీక్ అయ్యాయి. దీంతో ఏ పనీ చేయలేకపోతున్నానని, సాయం కావాలని సీఎంను కోరాడు. చెన్నై, వేలూరు, తిరుపతి , బెంగళూరు ఆస్పత్రులకు తిరిగినా నయం కాలేదు.. ఖర్చులు పెరుగుతున్నాయిని.. ఆ స్థోమత లేకపోవడంతో ఆస్పత్రులకు వెళ్లలేకపోయానని బాధితుడు చెప్పారు. అందకే సీఎంను కలవాలని ఆ యువకుడు ప్రయత్నించాడు. ఆ విషయాన్ని అధికారులు సీఎంకు చెప్పడంతో.. స్వయంగా సీఎం వెళ్లి యువకుడ్ని కలిసి.. భరోసా ఇచ్చారు.
CM Jagan helping Hand || మరోసారి పెద్దమనసు చాటుకున్న సీఎం జగన్ .. ఏం చేశా... https://t.co/CZ7m5QW0OH via @YouTube #JaganMohanReddy #Jagananna #jaganreddy #JaganPaniAyipoyindhi #jagan #ycpinsultsayyappa
— nagesh paina (@PainaNagesh) December 25, 2022
సీఎం ఆదేశాలతో అధికారులు వెంటనే ఆ వ్యక్తికి ఆర్థిక సాయం అందించడంతో పాటు.. భవిష్యత్తులో వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. దీంతో ఆ యువకుడి కుటుంబం.. సీఎం జగన్ కు ధన్యవాదాలు చెప్పారు. దేవుడిలా తమ బాధను అర్థం చేసుకుని వరం ఇచ్చారని.. ఎప్పటికీ సీఎంకు రుణపడి ఉంటామన్నారు..
మరోవైపు కూడా జగన్ ఒకరికి సాయం అందించారు. కడప పర్యటనలో సీఎంని కలిసి తమ కుమారుడి అనారోగ్య సమస్యను వివరించాడు భూమాయపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు. వెంటనే స్పందించిన సీఎం, ప్రభుత్వం తరపున సహాయం చేస్తానని హామీ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వెంటనే 1 లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందించారు జిల్లా కలెక్టర్ విజయరామరాజు.
ఇదీ చదవండి : చంద్రబాబు రోడ్ షోలకు పవర్ కట్.. సైకో పాలనను తరిమేయాలంటూ చంద్రబాబు పిలుపు..
భూమాయపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు, తను కడపలో రోజూ కూలీపనికి వెళుతూ జీవనం సాగిస్తున్నాడు. తన 12 ఏళ్ల కుమారుడు నరసింహ ప్రస్తుతం నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడని.. తన బాధను సీఎం జగన్ కు చెప్పుకునే ప్రయత్నం చేశాడు. తన కుమారుడి బాధ గురించి తెలిసిన వెంటనే సీఎం చలించిపోయి.. తమకు ఆర్థిక సాయం చేశారని ఓబులేసు ఆనందం వ్యక్తం చేశాడు. సీఎం జగన్ ఎంత బిజీగా వున్నా.. తన సాయం కోరి వచ్చేవారిని ఆదుకుంటూ తన మానవత్వాన్ని జగన్ చాటుకుంటున్నారని బాధితులు, వైసీపీ నేతలు ప్రశంసిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Kadapa