YS Avinash Redd: సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (Ex Minister YS Vivekanand Reddy) హత్య కేసు (Murder Case) ముగింపునకు చేరుతున్నట్టే పరిణామాలు కనిపిస్తున్నాయి. తాజాగా మరోసారి కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) సీబీఐ (CBI) నోటీసులు జారీ చేసింది.. ఇవాళ కచ్చితంగా విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ అవినాష్ రెడ్డి హాజరు కాలేదు.. దీంతో మరోసారి స్వయంగా పులివెందులలోని ఎంపీ నివాసానికి వెళ్లి విచారణకు రావాలని నోటీసులు అందించారు సీబీఐ అధికారులు.. ఆయనతో పాటు తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా మరోసారి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి రెండు సార్లు విచారణకు హాజరు కాగా.. భాస్కర్ రెడ్డి ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈ సారి పరిణామాలు చాలా కీలకంగా ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో తరువాత విచారణలో ఏం జరుగుతుందని ఉత్కంఠ పెంచుతోంది..
అయితే తాజా నోటీసులపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఇవాళ విచారణకు హాజరు కాలేనని అవినాష్ రెడ్డి చెప్పారు.. ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరవుతానని.. తన తండ్రి భాస్కర్ రెడ్డి 12న విచారణకు హాజరవుతారంటూ స్పష్టం చేశారు. అయితే ఈ రెండు విచారణల తరువాత అరెస్టులు ఉంటాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఏం జరుగుతుందనే ఆసక్తి పెరిగింది.
ఇప్పటికే అవినాష్‌ను రెండుసార్లు విచారించింది సీబీఐ.. ఇప్పుడు మూడోసారి విచారించేందుకు సిద్ధమైంది. వివేకా హత్య కేసులో మొదటి నుంచి ఎంపీ వైఎస్ అవినాష్ పై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులు మూడోసారి కూడా విచారించేందుకు సిద్ధమవుతున్నారంటే.. ఈ సారి పరిణామాలు కొంచెం కీలకంగా ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అవినాష్ తండ్రి ఇక అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి ఎందుకు హాజరు కావడం లేదని విపక్షాలు సైతం విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యం ఈ నెల తరువాత విచారణలో ఏం జరుగుతోంది అన్నది ఉత్కంఠ పెంచుతోంది.
ఇప్పటికే ఈ కేసులో అన్ని వేళ్లూ అవినాష్ వైపునకు చూపిస్తున్నట్టు ప్రాచారం జరుగుతోంది. తాజాగా మరోసారి సీబీఐ విచారణకు రావాలని ఆదేశించిన నేపథ్యంలో మూడోసారి హాజరైతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సీబీఐ అధికారుల తీరుపై వైసీపీ కీలక నేతలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతా చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతోందని.. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అంత దారుణం మరొకటి ఉండదంటూ ఇటీవల సజ్జల వ్యాఖ్యానించారు. దీంతో అవినాష్ అరెస్ట్ అవుతారని వైసీపీ వర్గాల్లో కూడ అనుమానాలు ఉన్నాయా అనే ప్రచారం జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, YS Avinash Reddy, Ys viveka murder case