హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kadapa Woman: ఆషాఢమాసంలో పుట్టింటికి వచ్చి శవమైంది... మిస్టరీగా మారిన చివరి ఫోన్ కాల్.. అతడెవరు..?

Kadapa Woman: ఆషాఢమాసంలో పుట్టింటికి వచ్చి శవమైంది... మిస్టరీగా మారిన చివరి ఫోన్ కాల్.. అతడెవరు..?

వెంకట భార్గవి (ఫైల్)

వెంకట భార్గవి (ఫైల్)

Mystery: ఆమెకు ఇటీవలే పెళ్లయింది. రెండు నెలల తర్వాత పుట్టింటికి వచ్చింది. ఇంతలోనే అదృశ్యమైంది. ఆమె కోసం వెతుకుతుండగానే ఊరిచివర శవమై తేలింది. ఊరు చివర కొండపై ఏం జరిగింది.. ఆమె ఎవరి బైక్ ఎక్కి వెళ్లింది.

ఆమెకు ఇటీవలే పెళ్లయింది. రెండు నెలల తర్వాత పుట్టింటికి వచ్చింది. ఇంతలోనే అదృశ్యమైంది. ఆమె కోసం వెతుకుతుండగానే ఊరిచివర శవమై తేలింది. ఊరు చివర కొండపై ఏం జరిగింది.. ఆమె ఎవరి బైక్ ఎక్కి వెళ్లింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కడప జిల్లా (Kadapa District) లో వివాహిత అదృశ్యం కేసు సస్పెన్ష్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం సోమయాజులపల్లెకు చెందిన వెంకటబార్గవికి రెండు నెలల క్రితం పులివెందులకు చెందిన వ్యక్తితో పెళ్లయింది. ఆషాఢమాసం కావడంతో అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చిన భార్గవి షాపింగ్ కోసం మైదుకూరు వెళ్తున్నానంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయింది.

ఆ తర్వాతి రోజు కూడా ఆమె ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా గ్రామ శివారులో ఆమె మృతదేహం లభ్యమైంది. డెడ్ బాడీ పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో జరిగినది హత్య లేక ఆత్మహత్య అనేది పోలీసులు తేల్చలేకపోతున్నారు. ఐతే చివరి సారిగా భార్గవి తన గ్రామానికే చెందిన బొందల గోపాల్ అనే వ్యక్తితో మాట్లాడినట్లు ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా తెలుసుకున్నారు.

ఇది చదవండి: 15 ఏళ్ల బాలుడితో 28 ఏళ్ల మహిళ జంప్.. ఎదురింటి కుర్రాడితో వ్యవహారం


గోపాల్, భార్గవి కలిసి బైక్ పై ఎద్దుమడుగు కొండ ప్రాంతానికి వెళ్లి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ఆమె చనిపోవడంతో పోలీసులు హత్యగా భావిస్తున్నారు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లికి ముందు భార్గవికి, గోపాల్ కు మధ్య ఏమైనా ప్రేమ వ్యవహారం గానీ, ఇతర సంబంధాలు గానీ ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. భార్గవి ఫోన్ కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ వంటివాటిని విశ్లేషిస్తున్నారు. ఆమెను బైక్ పై తీసుకెళ్లిన గోపాల్ ఆచూకీ లభ్యమైతే కేసు మిస్టరీ వీడే అవకాశముంది. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే పూర్తి వివరాలు చెప్తామని పోలీసులంటున్నారు.

ఇది చదవండి: ఆన్ లైన్లో ఫ్రెండ్ షిప్.. న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్..


ఇదిలా ఉంటే భార్గవి హత్యపై ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నాయి. అన్యాయంగా తమ కుమార్తెను పొట్టనబెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. గోపాల్ ను అదుపులోకి తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లా దోర్నాల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఇలాంటి హత్య కేసు వెలుగు చూసింది. కర్ణాటకకు చెందిన ఓ మహిళను ఆమె భర్త, అతడి సోదరుడు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని కల్వర్టు కిందపడేసి వెళ్లిపోయారు. 11 ఏళ్ల తర్వాత హత్య వ్యవహారం బయటపడటంతో నిందితులను అరెస్ట్ చేశారు.

First published:

Tags: Andhra Pradesh, Crime news, Kadapa

ఉత్తమ కథలు