మనం ఏదైనా గుడికి వెళ్ళినపుడు ప్రధానంగా శివాలయాలకి వెళ్ళినపుడు అక్కడ మనకి తప్పనిసరిగా నవగ్రహలు దర్శనం ఇస్తాయి. కానీ ప్రతి చోట ఈ నవగ్రహలు శిలా రూపంలోనో లేకపోతే విగ్రహాల రూపంలో మనం దర్శించుకుంటూ ఉంటాము.ఇలా కాకుండా ఎప్పుడైనా ఈ నవగ్రహాలు వారి సతి సమేతంగా ఉండడాన్ని ఎప్పుడైనా చూశారా.... లేదా.... అయితే ఇక్కడికి విచ్చేయండి.
మన కడప జిల్లా సమీపంలో వాటర్ గండి ప్రాంతంలో కొలువుదీరిన శ్రీ రామలింగేశ్వర ఆలయంలో కొలువైన నవగ్రహలు సతీ సమేతంగా మనకి దర్శనం ఇచ్చి పూజలందుకుంటున్నారు. ఇలాగా నవగ్రహాలు కోలువిదీరిన ఆలయం మన జిల్లాలో ఇదొకటే అని సమాచారం. మరికొంత ఆసక్తికరమైన సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ సాంప్రదాయంలో మానవుని యొక్క దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేకమైన సమస్యలకి పరిష్కారంగా ఈ నవగ్రహ పూజలు నిర్వహిస్తారు. ఆ సమస్య కారణం తెలిసిన వెంటనే సంబంధిత గ్రహానికి పూజించి ఆ గ్రహానుగ్రహం పొంది వారికి కలిగిన బాధలనుండి విముక్తి పొందుతుంటారు.ఈ విధంగా నవగ్రహలు వ్యక్తి యొక్క జీవితాన్ని నిర్ణయించటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని నమ్ముతారు. ఈ నవగ్రహాలు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి(గురు గ్రహం), శుక్ర (శుక్రుడు) ,శని, రాహువు (ఉత్తర మరియు కేతువు. ఈ తొమ్మిది గ్రహాలు మనుషుల జీవితాలను నియంత్రిస్తాయని, జీవితంలో ఎదుర్కొనే మంచి చెడులను నిర్ణయిస్తాయని హిందూ ధర్మంలో నమ్ముతారు.
అందువలన ఈ నవ గ్రహాలను పూజించడం, హోమాలు, వ్రతాలు నిర్వహించడం చాలామంది హిందువుల ఆచారాలలో ఒక ముఖ్యమైన అంశంగా మారింది. చాలా ఆలయాలలో, ముఖ్యంగా శివాలయాలలో నవగ్రహాల మందిరాలను మనం చూస్తూ ఉంటాం.ఈ ఆలయం కడప జిల్లా శివార్లలో వాటర్ గండి సమీపంలో నిర్మించబడి, భక్తులు వారి జీవితం సజావుగా సాగాలనే ఉద్దేశ్యంతో, వారికి గల దోషాలను నివారించుకోడానికి అనునిత్యం ఇక్కడి నవగ్రహాలకు విశేషమైన పూజలు చేస్తూ ఉంటారని ఆలయపురోహితులు తెలిపారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News