D.Prasad, News18, Kadapa
తెలుగుదేశం పార్టి నాయకుడు నారా లోకేష్ యువ గళం పాదయాత్ర, జనవరి 27 నుండి కుప్పం వేదికగా ప్రారంభించనున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ క్రమంలో మన జిల్లా మీదుగా వెళ్తూ ఏర్పాటు చేసిన టూర్ షెడ్యుల్ లో స్వల్ప మార్పులు చేటు చేసుకున్నాయని నగర తెలుగు దేశం పార్టి అధికార వర్గాలనుండి సమాచారం.
ఆయన 25-1-23 బుధవారం మధ్యాహ్నం 1.45కి హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్కి చేరుకుని నందమూరి తారకరామునికి నివాళులు అర్పించనున్నారు. అక్కడ నుండి బయలుదేరి అదే రోజు సాయంత్రం కడప నగరానికి చేరుకోనున్నారు. కడప చేరుకున్న తరువాత ముందుగా తిరుమల తొలి గడప పుణ్యక్షేత్రం, శ్రీ దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించనున్నారు.
అనంతరం దేవుని కడప ఆలయం నుండి సరాసరి కడప నగరంలోని సుప్రసిద్ధమైన ప్రాచుర్యం కలిగిన అమీన్ పీర్ దర్గా ను సందర్శించనున్నారు. అక్కడినుంచి కడపలోని అతి పురాతనమైన రోమన్ కేథలిక్ చర్చిలో సాయంత్రం 6.30 గంటల సమయానికి జరుగు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో తిరుమల దేవస్థానములు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.
మర్నాడు 26-1-23 గురువారం ఉదయం కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటారు. ఈ విధంగా తిరుమల నుండి బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి కుప్పం చేరుకుంటారు.ఈ విధంగా ఆయన జిల్లలో పర్యటించనున్న షెడ్యుల్ లో స్వల్ప మార్పులు చేసినట్లు జిల్లా పార్టి వర్గాలు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News