ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని వైఎస్ఆర్ జిల్లా (YSR District) కేంద్రం కడప (Kadapa) తీవ్ర కలకలం రేగింది. నగర శివారులో మూడు గుర్తుతెలియని మృతదేహాలు కనిపించడం సంచలనం రేకేత్తిస్తోంది. గువ్వల చెరువు ఘాట్ లోడ్డులోని ఐదో మలుపు వద్ద మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వీరిలో ఓ మహిళ, ఇద్దరు పురుషులున్నారు. దాదాపు వారం క్రితం వీరంతా చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. సమీపంలోని చెరువులో మరో మృతదేహం ఉందన్న అనుమానంతో గాలిస్తున్నారు. మృతదేహాలన్నీ గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. ఇవన్నీ హత్యలా..? లేక ఆత్మహత్యలా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, Kadapa