Home /News /andhra-pradesh /

KADAPA MOTHER IN LAW BRUTALLY KILLED DAUGHTER IN LAW FOR HAVING EXTRAMARITAL AFFAIR IN KADAPA DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Kadapa News: ప్రియుడితో సహా ఇంటికొచ్చిన కోడలు.. తలనరికి పోలీసుల ముందుంచిన అత్త.. ఏపీలో షాకింగ్ సీన్..

సుబ్బమ్మ, వసుంధర (ఫైల్)

సుబ్బమ్మ, వసుంధర (ఫైల్)

Kadapa News: భర్త చనిపోవడంతో కోడలు వేరొకరితో అక్రమ సంభంధం పెట్టుకుంది. దీంతో ఆస్తిలో చిల్లి గవ్వ ఇచ్చేది లేదంటూ అత్త కోడలితో గొడవ. ఇద్దరి మధ్య భీకర యుద్ధ వాతావరణం... చివరకు కోడలి తలతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన అత్త... ఇంతకీ ఏమైందంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kadapa (Cuddapah), India
    GT Hemanth Kumar, News18, Tirupati

    సాధారణంగానే అత్త కోడళ్ల మధ్య సఖ్యత అంతగా ఉండదు. అత్తా అంటే కోడలికి కష్టం... కోడలిని చూస్తేనే అత్త కస్సు మంటూ తిట్టే నైజాన్ని కలిగి ఉంటారు. పనులు చేయాలన్న ఒకరిపై మరొకరు సాకులు చెప్పుకుంటూ... తిట్ల దండకాలు అందుకుంటూ ఉంటారు. ఇద్దరి మధ్య పచ్చ గడ్డి కాదు... పచ్చటి చెట్టు పెట్టిన భస్మం అయ్యేలా ఉంటుంది వైరం. కొడుకు కొన్నాళ్ల క్రిందట హత్యకు గురైయ్యాడు. ఇంట్లో కోడలితో కలసి అత్త ఉంటున్నా... ఇద్దరి మధ్య సఖ్యత లేదు. ఉన్నంతలో ఆస్థి బాగానే కుట్టబెట్టారు. భర్త చనిపోవడంతో కోడలు వేరొకరితో అక్రమ సంభంధం పెట్టుకుంది. దీంతో ఆస్తిలో చిల్లి గవ్వ ఇచ్చేది లేదంటూ అత్త కోడలితో గొడవ. ఇద్దరి మధ్య భీకర యుద్ధ వాతావరణం... చివరకు కోడలి తలతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన అత్త... ఇంతకీ ఏమైందంటే..?

    వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అన్నమయ్య జిల్లా (Annamayya District) రాయచోటి మండలంలో నివాసం ఉంటుంది సుబమ్మ. ఈమె కోడలు వసుంధరతో కలసి కొత్తపేట రామాపురంలో ఉంటోంది. కొడుకు ఉన్నంత కాలం కోడలితో అత్త బాగానే మెలిగేది. కొన్ని తగాదాలు కొని తెచ్చుకున్న కొడుకు కొన్నేళ్లక్రిందట శ్రీకాళహస్తి పట్టణంలో హత్యకు గురైయ్యాడు. దీంతో అత్తాకోడళ్లిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. భర్త పోయిన నాటి నుంచి అత్తాకోడళ్ల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతున్నాయి.

    ఇది చదవండి: లేచిపోయి పెళ్లి చేసుకున్న అమ్మాయిలు.. పోలీస్ స్టేషన్లో షాకింగ్ పంచాయితీ.., చివర్లో...


    మరోవైపు యుక్తవయసులో ఉండటం.. భర్త లేకపోవడంతో కోడలు వసుంధర మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న అత్త తరచూ కోడలితో గొడవకు దిగేది. కుటుంబానికి చెందిన కొంతపొలంతో పాటు ఇల్లు, ఇతర ఆస్తులు అత్త సుబ్బమ్మ పేరిట ఉన్నాయి. దీంతో ఆస్తిలో తనకు వాటా కావాలని అత్తతో గొడవపడుతుండేది వసుంధర.


    ఇది చదవండి: బుగ్గ కొరికాడని భర్తపై కేసు పెట్టిన భార్య.. ఇద్దరి మధ్య అంతలా ఏం జరిగిందంటే..!


    ఈ క్రమంలో ఇవాళ ఉదయం నుంచి గొడవ తారాస్థాయికి చేరుకుంది. దీంతో సుబ్బమ్మ తన అన్న కొడుకుతో మాట్లాడుతుండగా.. కోడలు వసుంధర తన ప్రియుడిని, మరిదిని వెంటబెట్టుకొని వచ్చింది. అక్కడితో ఆగకుండా అత్తతో గొడవకు దిగింది. ఇద్దరూ కాసేపు జుట్టుజుట్టు పట్టుకొని గొడవపడ్డారు. అదే సమయంలో కోడలు వసుంధర ఎక్కడ చంపేస్తుందో అని భయపడిన సుబ్బమ్మ.. తన అన్న కొడుకుతో కలసి కత్తితో కోడలి తల నరికేసింది. అంతేకాదు మొండెం నుంచి తలను వేరు చేసి తలను తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ధైర్యంగా రోడ్డుపై వెళ్తున్న ఆమెను చూసి స్థానికులు హడలిపోయారు. సుబ్బమ్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Extramarital affairs, Kadapa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు