హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఫోన్ పోయిందని బాధపడుతున్నారా? డోంట్ వర్రీ ఇలా చేయండి..

ఫోన్ పోయిందని బాధపడుతున్నారా? డోంట్ వర్రీ ఇలా చేయండి..

మీ మొబైల్ పోయిందని బాధపడుతున్నారా?

మీ మొబైల్ పోయిందని బాధపడుతున్నారా?

మీ మొబైల్ పోయిందని బాధపడుతున్నారా? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా కూడా లాభం లేదా, ఇక మొబైల్ దొరకదని ఆశలు వదిలేసుకున్నారా? అది ఒకప్పుడు ఇప్పుడు మీ మొబైల్ పోయినా లేదా దొంగలించబడిన మీ మొబైల్ తిరిగి కేవలం నెల రోజుల్లో పొందవచ్చు. ఎలాగో తెలుసుకోవాలని ఉందా...అయితే మీరు ఇది చదవాల్సిందే.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kadapa (Cuddapah), India

D.Prasad, News18, Kadapa

మీ మొబైల్ పోయిందని బాధపడుతున్నారా? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా కూడా లాభం లేదా, ఇక మొబైల్ దొరకదని ఆశలు వదిలేసుకున్నారా? అది ఒకప్పుడు ఇప్పుడు మీ మొబైల్ పోయినా లేదా దొంగలించబడిన మీ మొబైల్ తిరిగి కేవలం నెల రోజుల్లో పొందవచ్చు. ఎలాగో తెలుసుకోవాలని ఉందా...అయితే మీరు ఇది చదవాల్సిందే.

Megastar Chiranjeevi: చిరంజీవి కాంగ్రెస్‌తోనే కొనసాగుతారా..? రాహుల్‌కి రాసిన ఆ లేఖలో ఏముంది..?

చాలా మంది తమ మొబైల్ ని పోగొట్టుకుని బాధ పడుతుంటారు. అలాంటి వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా, ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయకుండా మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి తిరిగి అందచేయాలని సంకల్పంతో గత సంవత్సరం డిసెంబర్ 1న ఎం.ఎం.టి.ఎస్ (మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం) అనే ఉచిత వెబ్ సైట్ సేవలని పోలీసులు ప్రారంభించారు. ఏపీలోని కడప జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం ఇది. ఈ వెబ్‌ సైటు ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఇప్పటివరకూ 1682 మొబైల్స్ మిస్సింగ్ ఫిర్యాదులు రాగా ఎం.ఎం.టి.ఎస్ ద్వారా 409 యాక్టీవ్ మొబైల్స్ గుర్తించారు. రూ.30 లక్షల విలువైన 130 మొబైల్ ఫోన్‌లను సైబర్ క్రైమ్ టెక్నికల్ విభాగం రికవరీ చేశారు.

కేవలం నెల రోజుల లోపల పోయిన ఫోన్లు రికవరీ చేసి తమకు అందచేయడంతో బాధితులు ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తూ..జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ కి థాంక్యూ ఎస్.పి సార్...అంటూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..సరైన బిల్లులు లేకుండా ఎవరూ మొబైల్ ఫోన్స్ కొనవద్దని ప్రజలకు సూచించారు. ప్రజలకు మరింత సులువైన సేవలు అందించడానికి చాట్ బాక్స్ ద్వారా 9392941541 సేవలు ప్రారంభిస్తున్నాం అని ఆయన తెలిపారు. ప్రస్తుతం దాదాపు రూ. 30 లక్షల విలువైన 130 మొబైల్స్ ను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. మిగిలిన మొబైల్స్ ను కూడా రికవరీ చేసి బాధితులకు అందిస్తామని హామీ ఇచ్చారు.

First published:

Tags: Andhrapradesh, Ap, Kadapa, Local News

ఉత్తమ కథలు