హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

మామిడి తోటలో గుర్తు తెలియని శవం.. అందుకే ప్రాణం పోయిందా..?

మామిడి తోటలో గుర్తు తెలియని శవం.. అందుకే ప్రాణం పోయిందా..?

కడప జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి

కడప జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి

సాధారణంగా అటవీ ప్రాంత రైతులు అడవి జంతువులు, పందులు నుండి పంటని రక్షించుకోవడానికి పొలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఉండటం వలన ఆ తీగలు నుండి వచ్చిన కరెంటు షాక్ వలన ఆ వ్యక్తి కి గాయాలు అయి చనిపోయినట్లుగా తెలుస్తున్నదని పోలీసులు అనుకుంటున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kadapa (Cuddapah), India

D Prasad, News18, Kadapa

కడప జిల్లాలో ఒక ఘోరమైన సంఘటన వెలుగు చూపింది. జిల్లాలోని పెండ్లిమర్రి మండలంలోని నందిమండలం గ్రామం సమీపంలో ఒక మామిడి తోటలో గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యం అయింది. అతని వయస్సు సుమారు 50 నుండి 55 సంవత్సరాలు ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన గురించి మరింత వివరాల్లోకి వెళితే.. నంది మండలం సమీపంలోని పొలాలలో సుమారు 50 సంవత్సరాల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి కాలిన గాయాలతో విగతజీవిగా కనిపించాడు. ఈ సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు.

శవంపైన ఉన్న కాలిన గాయాలు మరియు చుట్టుపక్కల ఉన్న ఆనవాళ్లను బట్టి అతను కరెంట్ షాక్ తగిలి మృత్యువాత పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా అటవీ ప్రాంత రైతులు అడవి జంతువులు, పందులు నుండి పంటని రక్షించుకోవడానికి పొలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఉండటం వలన ఆ తీగలు నుండి వచ్చిన కరెంటు షాక్ వలన ఆ వ్యక్తి కి గాయాలు అయి చనిపోయినట్లుగా తెలుస్తున్నదని పోలీసులు అనుకుంటున్నారు.

ఇది చదవండి: రౌడీ షీటర్‌తో మహిళ ఎఫైర్.. ఓ రోజు రాత్రి మరిదితో కలిసి

ఇక చనిపోయిన వ్యక్తిని గమనించినట్లైతే ఈ వ్యక్తి నిక్కరు జేబులో Times Quartz కంపెనీకి చెందిన చేతి గడియారం, ఒక అగ్గిపెట్టె కలవని, అతను నీలము తెలుపు నలుపు రంగులు కలిసిన గళ్ళ చొక్కా, గళ్ళ పంచె, ఆకుపచ్చ నిక్కరు, తెలుపు మరియు గోధుమరంగు ప్యారగాన్ హవాయి చెప్పులు ధరించి ఉన్నాడని అతని ఆనవాళ్లు గుర్తుపట్టినవారు పెండ్లిమర్రి పోలీసు స్టేషనులోసమచారం ఇవ్వవలసిందిగా కోరారు.

First published:

Tags: Andhra Pradesh, Kadapa, Local News

ఉత్తమ కథలు