రైలు ప్రమాదాలు. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో లెక్కలేనన్ని స్వల్ప అజాగ్రత్త వలన ఒక నిండు జీవితం కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది ఒకరితో పోయే అంశం కాదు, మన జీవితంలో మనల్ని నమ్ముకుని వున్న అనుబంధాలు, కుటుంబ వ్యవస్థలు చిన్నా భిన్నమవడానికి ఈ ప్రమాదాలు కారణమవుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. కమలాపురం మండలం సి గోపులాపురం వద్ద వేగంగా వెళ్తున్న ట్రైన్ నుండి ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి కింద పడిపోయాడు.
పడిపోయిన అతను అక్కడికక్కడే మరణించగా, అతన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి మృతుడు చత్తీస్గడ్ కు చెందిన మన్ రాజ్ సింగ్ (39) అన్నట్లు పోలీసులు గుర్తించారు.ఎక్కడో చత్తీస్గడ్ ప్రాంతానికి చెందిన అతను ఇలా రైలు ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరమని, అనువుగాని స్థలంలో ఇలా విగతజీవిగా పడి ఉండటాన్ని చూసిన స్థానికులు బాధపడుతున్నారు.
ఈ సంఘటనలో సంబంధించిన కారణాలు తెలియదని, బహుశా మృతుడు రైలు ప్రయాణంలో ఉన్న సమయంలో అదుపుతప్పి ఇలాంటి ప్రమాదం జరిగి ఉండొచ్చు అని పోలీసులు భావిస్తున్నారు. మరింత స్పష్టమైన సమాచారం కొరకురైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.ఏదీ ఏమైనా ఇలా చిన్న చిన్న తప్పిదాలతో, అవగాహన లోపంతో రైలు ప్రయాణం చేస్తూ అనేకమంది మరణిస్తున్నారు. అంతే కాకుండా యువత కొన్ని రకాలైన అని అనివార్య కారణాల వలన వారి జీవితాలను పణంగా పెట్టి ఇలా విగత జీవులుగా మారుతున్నారు. అధికారులు ఈ రైలు ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తున్నా కూడా ఫలితం శూన్యంగా మిగులుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News