హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

గర్భవతి అని చూడకుండా భార్యను అలా చేశాడు.. కోర్టు విధించిన శిక్ష ఇదే..

గర్భవతి అని చూడకుండా భార్యను అలా చేశాడు.. కోర్టు విధించిన శిక్ష ఇదే..

భార్యను హత్య చేసిన నిందితుడు

భార్యను హత్య చేసిన నిందితుడు

Andhra pradesh: వైయస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో 2014లో వరకట్న వేధింపులతో జరిగిన వివాహిత హత్య కేసులో నేర నిరూపణ అయ్యింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

వైయస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో 2014లో వరకట్న వేధింపులతో జరిగిన వివాహిత హత్య కేసులో నేర నిరూపణ అయినందున ముద్దాయి, మృతురాలి భర్త అయిన వక్కల సయ్యద్ హుస్సేన్ (39) కు 302, 498 A, 304(B) IPC సెక్షన్ల క్రింద యావజ్జీవ కఠిన కారాగార శిక్ష తో పాటు రూ.2.10 లక్షల జరిమానా విధిస్తూ రెండవ అదనపు జిల్లా కోర్టు జడ్జి జి.ఎస్.రమేష్ కుమార్ తీర్పు ఇచ్చారు.

జరిమానా మొత్తాన్ని మృతురాలి మైనర్ కుమార్తెకు చెల్లించాలని జడ్జి తీర్పులో పేర్కొన్నారు. కేసు వివరాల్లోకెళితే.. ప్రొద్దుటూరు పట్టణంలోని వన్ టౌన్ పరిధిలోని మట్టి మసీద్ వీధిలో నివసించే వక్కల సయ్యద్ హుస్సేన్, చక్రాయపేటకు చెందిన సయ్యద్ అల్లా బకాష్ కుమార్తె సయ్యద్ యాస్మిన్(25) ను 2010 సం. లో వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో ముస్లిం సంప్రదాయం ప్రకారం లాంఛనాలతో పాటు 10 తులాల బంగారు నగలు, రూ. 40 వేల నగదును వరకట్నంగా ఇచ్చారు.

పెళ్లి అయిన కొద్ది రోజుల నుండి అదనపు కట్నం కోసం భర్త మానసిక, శారీరక వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలో 22.2.2014 న 7వ నెల గర్భంతో ఉన్న భార్య సయ్యద్ యాస్మిన్ ను రోకలిబండ తో తలపై మోది దారుణంగా హత్యచేసినట్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మృతురాలి తండ్రి సయ్యద్ అల్లా బకాష్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగినప్పటి సమయానికి దంపతులకు మూడేళ్ళ కుమార్తె కూడా ఉంది. దర్యాప్తు లో భాగంగా సాక్షుల విచారణ అనంతరం అప్పటి ప్రొద్దుటూరు డి.ఎస్.పి జె.శ్రీనివాసుల రెడ్డి (ప్రస్తుత విశ్రాంత అధికారి) అదే రోజున(22.2.2014) ముద్దాయి హుస్సేన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

కేసు విచారణలో ఎలాంటి సాక్ష్యాలు లేనందున ముద్దాయి తల్లి అయిన సయ్యద్ జైబున్నీసా ను నిర్దోషిగా విడుదల చేశారు. ప్రొద్దుటూరు ఏ.ఎస్.పి ప్రేర్ణాకుమార్ ఐ.పి.ఎస్ గారి ఆధ్వర్యంలో కేసు విచారణకు సహకరించిన ప్రొద్దుటూరు వన్ టౌన్, కోర్టు మానిటరింగ్ సిబ్బందిని జిల్లా ఎస్.పికే.కే.ఎన్ అన్బురాజన్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రాసిక్యూషన్ లో బలమైన వాదనలు వినిపించిన ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాంప్రసాద్ రెడ్డిని జిల్లా ఎస్.పీఅభినందించారు.

First published:

Tags: Andhra Pradesh, Crime news, Kadapa, Local News