D Prasad, News18, Kadapa
మొబైల్ ఫోన్ (Mobile Phone) పొగొట్టుకున్నవాళ్లకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పోలీసులు గడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. మొబైల్ ఫోన్ గురించి వాట్సాప్ (What’s App) లో కంప్లైంట్ ఇచ్చినా.. ఇంటికే ఫోన్ పంపేలా ఏపీ పోలీసులు (AP Police) పనిచేస్తున్నారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా, ఎఫ్.ఐ.ఆర్ నమోదు లేకుండా ఫోన్లు పోగొట్టుకున్న వారికితిరిగి అందచేయాలని సంకల్పంతో గత ఏడాది డిసెంబర్ 1 న ప్రారంభించిన ఎం.ఎం.టి.ఎస్ (Missing mobile tracking system) ఉచిత వెబ్ సైట్ సేవలను కడప జిల్లా పోలీస్ శాఖ (Kadapa District Police) ఆధ్వర్యంలో రూపొందించిన మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం, (వాట్సాప్ నెంబర్ 9392941541) ప్రారంభించిన అతి తక్కువ కాలంలో కడప జిల్లా పోలీసులు రూ.1.3 కోట్ల విలువైన 476 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి రికార్డ్ సృష్టించారు.
అతి తక్కువ కాలంలోనే ఫోన్లు రికవరీ చేసి తమకు అందచేయడంతో బాధితుల వదనంలో హర్షం నిండింది. ఈ సందర్భంగా బాధితులు జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్ కి "థాంక్యూ ఎస్.పి సార్"... అంటూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సేవలను ప్రజలకు మరింత సులువైన సేవలు అందించడానికి చాట్ బాక్స్ ద్వారా 9392941541 సేవలను ప్రారంభించారు.
ఈ చాట్ బాక్స్ ద్వారా ఇప్పటి వరకూ 3600 మొబైల్స్ మిస్సింగ్ ఫిర్యాదులు రాగా.. ఎం.ఎం.టి.ఎస్ ద్వారా 700 యాక్టీవ్ మొబైల్స్ ని గుర్తించారు. దీనివలన దాదాపు రూ.60 లక్షల విలువైన 215 మొబైల్స్ ను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. అంతే కాకుండా మిగిలిన మొబైల్ ఫోన్లని కూడా రికవరీ చేసి ప్రజలకి అందిస్తామని ఎస్పీ ఈ సందర్భంగా తెలియజేశారు. అంతే కాకుండా సరైన బిల్లులు లేకుండా ఎవరూ మొబైల్ ఫోన్స్ కొనవద్దని ప్రజలకు సూచించారు. ఈ మీడియా సమావేశంలో అదనపు ఎస్.పి (అడ్మిన్) తుషార్ డూడి ఐ.పి.ఎస్, ఫ్యాక్షన్ జోన్ డి.ఎస్.పి చెంచుబాబు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Police, Kadapa, Local News