Viveka Murder Case: అధికార వైసీపీ (YCP)కి వరుస షాక్ లు తప్పడం లేదు. ఇటు కేసులు.. విచారణలు.. అటు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అన్ని ప్రతికూలంగానే మారుతున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Graduate MLC Elections) టీడీపీ రెండు చోట్ల విజయం సాధించగా.. మరో చోట హోరా హోరీ పోరు కనిపిస్తోంది. మరోవైపు లిక్కర్ కేసులు ఎంపీ మాగుంట విచారణకు హాజరవుతున్నారు. ఆయన కుమారుడు ఇప్పటికే ఈ కేసులో జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మాంగుట విచారణ కూడా ఉత్కంఠంగా మారింది. ఇదే సమయంలో ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) అరెస్ట్ చేస్తారనే ప్రచారం అధికార పార్టీని కలవరానికి గురి చేస్తోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే సీబీఐ (CBI) దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డిని నాలుగు సార్లు విచారించింది. మరోవైపు సీబీఐ విచారణను వ్యతిరేకిస్తూ .. హైకోర్టులో పిటిషన్ చేశారు అవినాష్‌రెడ్డి.
అయితే సీబీఐ విచారణపై స్టే ఇవ్వటంతో పాటు మూడు అంశాలు ప్రస్తావిస్తూ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇందులో రెండింటిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణను యధావిధిగా కొనసాగించవచ్చని చెప్పింది. అలాగే తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలన్న అవినాష్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. అరెస్టు విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.
విచారణ జరిపే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ తప్పనిసరని ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరుగుతున్న తీరు న్యాయవాదికి కనిపించేలా అనుమతించాలని సూచనలు చేసింది. హైకోర్టు తీర్పు తర్వాత సీబీఐ ఎలా వ్యవహరిస్తుందన్నది కీలకంగా మారింది. పార్లెమెంట్ సమావేశాలు.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి సైతం ప్రస్తుతం హస్తినలోనే ఉన్నారు. అయితే అక్కడే అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు సీబీఐ సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ఇదీ చదవండి : తక్కువ స్థలం.. అతి తక్కువ ఖర్చు.. కదిలే ఇళ్లకు ఫుల్ డిమాండ్.. బడ్జెట్ ఎంతంటే?
ఈ కేసులో అన్ని ప్రతికూలకంగా మారుతున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు అవినాష్‌రెడ్డి అప్పీల్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే సీబీఐ విచారిస్తోందని.. ఈ కేసుతో తనకుఎలాంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి చెబుతున్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక.. తన ప్రత్యర్థులు ఈ కేసులో ఇరికించాలని భావిస్తోందని ఆయన వాధిస్తున్నారు.
ఇదీ చదవండి : అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదా..? హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లే యోచనలో కడప ఎంపీ..?
అయితే ఏ క్షణం అయినా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. వైసీపీ నేతలు కూడా అరెస్ట్ చేస్తే అంతకన్న దారుణం ఏముండదని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఈ కేసులో ఏదో జరగబోతోందనే అంతా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో సీఎం జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇద్దరు కేంద్ర పెద్దలను కలవడం మరింత చర్చనీయాంశంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో మరి
మరి సీబీఐ నెక్ట్స్ స్టెప్ ఏంటి? అవినాష్ రెడ్డికి సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇస్తుందా? అన్నది ఉత్కంఠ పెంచుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, YS Avinash Reddy, Ys viveka murder case