హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: వాట్సాప్ మెసేజ్‌ లింక్‌పై క్లిక్ చేసిన మహిళ.. రూ.21 లక్షలు మాయం..!

Andhra Pradesh: వాట్సాప్ మెసేజ్‌ లింక్‌పై క్లిక్ చేసిన మహిళ.. రూ.21 లక్షలు మాయం..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Kadapa News: ఒక మహిళ అలా తనకు వాట్సాప్‌లో వచ్చిన ఒక మెసేజ్ లింక్‌పై క్లిక్ చేసి రూ.21 లక్షలు పోగొట్టుకుంది. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Rayachoti, India

  తన వాట్సాప్ (What's APP) మెసేజ్‌తో వచ్చిన లింక్‌పై క్లిక్ చేసిందో మహిళ. అంతే ఆమె బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న రూ.21 లక్షలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఆ లింక్ ద్వారా ఆమె ఫోన్ హ్యాక్ చేసి, డబ్బులు కొట్టేశారు. ఇలాంటి మెసేజెస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గుర్తు తెలియని నెంబర్లు, సోర్సెస్ నుంచి వచ్చే టెక్స్ట్ మెసేజెస్, వాట్సాప్‌ మెసేజెస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎంత చెబుతున్నా కొందరు నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కి చెందిన ఒక మహిళ అలా తనకు వాట్సాప్‌లో వచ్చిన ఒక మెసేజ్ లింక్‌పై క్లిక్ చేసి రూ.21 లక్షలు పోగొట్టుకుంది. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లాకు చెందిన వరలక్ష్మి అనే మహిళ టీచర్‌గా పని చేసి రిటైరయ్యారు.


  సోమవారం ఆమెకు గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్‌లో ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసెజ్‌తో ఉన్న లింక్‌పై క్లిక్ చేసింది. తర్వాత వెంటనే ఆమె అకౌంట్ నుంచి వరుసగా డబ్బులు పోయాయి. అనేక సార్లు ఆమె అకౌంట్‌లోంచి రూ.20,000, రూ.40,000, రూ.80,000 చొప్పున విత్‌డ్రా అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి.


  Read this also ; Vijayawada: సోషల్ మీడియాలో పరిచయం.. మహిళకు వేధింపులు.. వైసీపీ నేతపై ఆరోపణలు.. అసలు స్టోరీ ఇదే..!


  మొత్తం ఆమె అకౌంట్‌లో ఉన్న రూ.21 లక్షలు పోయాయి. దీంతో షాక్ అయిన ఆ మహిళ వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించింది. ఆమె ఫోన్ హ్యాక్ అయ్యిందని, సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని బ్యాంకు అధికారులు సూచించారు.  Read this also ; Vizag: ఐడియా అంటే ఇది.. అంబాసిడర్ కారులో టేస్టీ చికెన్.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు


  వెంటనే ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాట్సాప్ లింక్‍‌పై అనేకసార్లు ఆమె క్లిక్ చేయడం వల్లే, తన అకౌంట్‌లోంచి డబ్బుల్ని సైబర్ నేరగాళ్లు కొట్టేశారని పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నామని, ఇలాంటి మెసేజెస్ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.


  Read this also: ఆ 21 గ్రామాలపైనే నిఘా పెట్టిన పోలీసులు.. కొన్ని రోజుల తర్వాత ఏం దొరికాయంటే..!


  ఇటీవల ఏపీలో పలుచోట్ల సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేయడం.. బ్యాంక్ ఎకౌంట్ నెంబర్లు, ఏటీఎం నెంబర్లు, ఓటీపీలు అడుగుతుండటం గుడ్డిగా నమ్మేస్తూ వివరాలిస్తున్నారు. ఆ తర్వాత ఖాతాల్లోని డబ్బులు ఖాళీ అవుతున్నాయి. గతంలో ఇలాంటి ఘటనల్లో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి వారిని అస్సలు నమ్మొద్దని.. గుర్తుతెలియని నెంబర్ల నుంచి ఫోన్లు గానీ, వాట్సాప్ లో లింకులు గానీ వస్తే పట్టించుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Andhrapradesh, Crime news, Rayalaseema

  ఉత్తమ కథలు